Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 18-04-2021

 

TS Covid-19 Media Bulletin 18-04-2021

తెలంగాణలో 5093 కొత్త కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 1,29,637 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 5,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 15 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,824కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,555 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,12,563కి చేరింది. ప్రస్తుతం 37,037 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,156 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 743 కేసులు నమోదయ్యాయి.



Previous
Next Post »
0 Komentar

Google Tags