Vaccine for All Above 18 Years Starting May 1
మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్
కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 సంవత్సరాలు దాటిని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మూడో విడత కరోనా వ్యాక్సిన్ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఏడాది కాలంగా అత్యధికమంది
భారతీయులకు వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని
నరేంద్రమోదీ ఈ సందర్భంగా అన్నారు. వీలైనంత తక్కువ సమయంలో అందరికీ వ్యాక్సిన్
అందేలా చూస్తామన్నారు. ఇందులో భాగంగా 18ఏళ్లు దాటిన ప్రతి
ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. ఔషధ సంస్థలు వ్యాక్సిన్ తయారీని
ముమ్మరం చేసేందుకు ప్రోత్సహించడంతో పాటు, అంతర్జాతీయంగా
కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఇతర కంపెనీల నుంచి దిగుమతి
చేసుకుంటామన్నారు.
0 Komentar