కోవిడ్ వ్యాక్సిన్ కు ముందు, తర్వాత
పాటించవలసిన కొన్ని ఆహార నియమాలు
కొవిడ్ వ్యాక్సిన్ సమర్థంగా పని
చేయాలంటే అందుకు తగిన విధంగా శరీరాన్ని సిద్ధం చేయాలి. ఇందుకోసం వ్యాక్సినకు ముందు, తర్వాత
కొన్ని ఆహార నియమాలు పాటించాలి.
1. వ్యాక్సిన్ తీసుకోబోయే
ముందు నుంచీ నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. సరిపడా హైడ్రేషన్ తో సైడ్ ఎఫెక్ట్స్
తీవ్రత తక్కువగా ఉండే వీలుంది.
2. మద్యం వ్యాధినిరోధకశక్తిని సన్నగిల్లేలా
చేస్తుంది. కాబట్టి వ్యాక్సిన్‌కు కొన్ని రోజుల ముందూ, తర్వాత
మద్యానికి దూరంగా ఉండాలి.
3. శాచురేటెడ్ ఫ్యాట్స్
ఉండే జంక్ ఫుడ్ తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం
తీసుకోవాలి. ఆహారంలో పీచు శరీరాన్ని
రిలాక్స్డ్ గా ఉంచడంతో పాటు, వ్యాధినిరోధకశక్తిని
బలపరుస్తుంది.
4. ఒత్తిడి, నిద్రలేమికి కారణమయ్యే తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఇంట్లో
తయారైన ఆహారం తీసుకోవడం మేలు.
5. కొబ్బరినీళ్లు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.
6. వ్యాక్సిన్ తీసుకున్న
తర్వాత తేలికగా అలసటకు గురి చేసే వేడి వాతావరణానికి దూరంగా ఉండాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar