Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Centre, states to seriously consider lockdown to curb spread of Covid: Supreme Court

 

Centre, states to seriously consider lockdown to curb spread of Covid: Supreme Court

లాక్ డౌన్ విధింపు పరిశీలించండి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచన  

 

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్రభట్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రోగులు ప్రాణవాయువు కోసం ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసరాల కోసం ఆక్సిజన్ మిగులు నిల్వలు (బఫర్ స్టాక్) ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం నిర్వహించాలి. దేశవ్యాప్తంగా వికేంద్రీకరించాలి. వచ్చే నాలుగు రోజుల్లో అత్యవసర నిల్వలను ఏర్పాటు చేయాలి.

రాష్ట్రాల కేటాయింపులకు అదనంగా ఈ నిల్వలను నిర్వహించాలని స్పష్టం చేసింది. “ప్రజల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ విధించే అవకాశాన్ని పరిశీలించండి. లాక్ డౌన్  వల్ల తలెత్తే సామాజిక, ఆర్థిక ఇబ్బందుల గురించి మాకు అవగాహన ఉంది. ముఖ్యంగా పేదలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలుసు. అందువల్ల లాక్ డౌన్ విధించేట్లయితే ఈ వర్గాల అవవసరాలు తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి" అని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రయోజనాల కోసం పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. వివిధ అంశాలపై సమాచారాన్ని కోరింది. సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

* సామూహిక సమావేశాలు, సభలు, వైరసీని సూపర్‌స్పెడర్‌గా వ్యాపింపజేసే కార్యక్రమాలపై కఠిన నిషేధం విధించాలి.

* రూ.50 లక్షల కరోనా బీమా వర్తించిన 22 లక్షల మంది వైద్య ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటి వరకు మరణించిన వారికి సంబంధించిన 287 క్లెయిమ్ లను పరిష్కరించినట్లు చెప్పారు. ఈ పథకం కింద ఇంకా ఎన్ని క్లెయిమ్ లు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని ఎంత కాలంలో పరిష్కరిస్తారు?

* కొవిడ్ సోకిన వైద్య ఆరోగ్య సిబ్బందికీ సరైన పడకలు, ఆక్సిజన్, అత్యవసర మందులు దొరకడం లేదని తెలిసింది. మరికొందరిని పాజిటివ్ గా తేలిన పది రోజుల్లో పే విధులకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టిన వైద్యుల సేవలను గుర్తించేందుకు వీలుగా జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాలి. వారికి ప్రోత్సాహకాలు ప్రకటించాలి.

* ఆరోగ్యానికి ముప్పు కలగకుండా విధులు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య సిబ్బందికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది తెలియలేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిష్కరించాలి.

* వైద్య సిబ్బందికి అవసరమైన ఆహారం, పని విరామ వేళల్లో విశ్రాంతి తీసుకోవడానికి స్థలం, రవాణా సౌకర్యం అందించడం, కొవిడకు గురైనప్పుడు జీతాలు, సెలవుల్లో కోతలు విధించరాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక సమయం విధులు నిర్వహించిన వారికి  ఓవర్ టైమ్ అలవెన్స్ ఇవ్వాలి.

* మహమ్మారి నియంత్రణ కోసం ఇప్పటి వరకు ఏం చేశారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారన్న దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలి.

* ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా అర్థించే వారిని అధికార యంత్రాంగం వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ విషయం అధికార యంత్రాంగానికంతటికీ తెలిసేలా ప్రతి జిల్లా కలెక్టర్ కు పంపాలని రిజిస్టార్ ను ఆదేశించింది.

* దిల్లీ ఆక్సిజన్ సమస్యను మే 3వ తేదీ అర్ధరాత్రిలోపు పరిష్కరించండి.

* ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లోపు ఒక జాతీయ విధానాన్ని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించాలి. కేంద్ర ప్రభుత్వం అలాంటి విధానం ఖరారు చేసేంత వరకూ స్థానిక చిరునామా లేదనో, గుర్తింపుకార్డు లేదనే కారణంతో రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా నిరాకరించడానికి కానీ, అత్యవసర మందులు తిరస్కరించడానికి కానీ వీల్లేదు.

* కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టిన కార్యాచరణను, ప్రొటోకాల్స్ ను పునఃసమీక్షించాలి. ఆక్సిజన్ లభ్యత, వ్యాక్సిన్ల అందుబాటు, వాటి ధరలు, అందుబాటు ధరల్లో అత్యవసర మందుల లభ్యతతో పాటు, ఈ ఆర్డర్లో పేర్కొన్న అన్ని అంశాల పైనా కేసు తదుపరి విచారణ జరిగే 10వ తేదీ లోపు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. అందుకు సంబంధించిన అఫిడవిట్లు అన్నింటినీ అమికస్ క్యూరీకి ముందుగా అందించాలి.

Previous
Next Post »
0 Komentar