Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు

 

నేటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు

రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు సోమవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానుసారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈనెల 5 నుంచి జరగాల్సిన  ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు (థియరీ) వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను 15 రోజుల ముందుగా విద్యార్థులకు తెలియచేస్తామని చెప్పారు. పరీక్షల తేదీలను ప్రకటించిన అనంతరం బోధన,  బోధనేతర సిబ్బంది అందరూ కళాశాలలకు హాజరు కావాలని సూచించారు.

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా



Previous
Next Post »
0 Komentar