Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chinese Rocket Segment Plunges Back to Earth, Crashes Near Maldives

 

Chinese Rocket Segment Plunges Back to Earth, Crashes Near Maldives

తప్పిన పెను ముప్పు - మాల్దీవ్స్ దగ్గర్లో కూలిపోయిన చైనా రాకెట్

గత కొన్ని రోజులుగా యావత్తు ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బి’ శకలాలు ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ దగ్గర్లో కూలాయి. దీంతో భూమిపై పడనున్నాయన్న భయాందోళనలకు తెరపడింది. భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకు శకలాలు పూర్తిగా భస్మమయ్యాయి. కేవలం కొన్ని చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడ్డాయి. ఈరోజు ఉదయం భూవాతావరణంలోకి ప్రవేశించిన శకలాల దశను చైనా మ్యాన్‌డ్‌ స్పేస్‌ ఇంజినీరింగ్‌ ఆఫీస్‌ ఎప్పటికప్పుడు పరిశీలించింది. హిందూ మహా సముద్రంపై రాకెట్‌ భాగాలు విచ్ఛిన్నమయ్యాయని ముందే పేర్కొంది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో శకలాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.  

అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగంగా చైనా గతవారం ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ అనే భారీ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్‌ మాడ్యూల్‌ను అది విజయవంతంగా మోసుకెళ్లింది. అయితే ఆ రాకెట్‌ నియంత్రణ కోల్పోయిందని, దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పుందని అంతరిక్ష రంగ నిపుణులు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. దాని ప్రయాణ మార్గాన్ని తమ అంతరిక్ష సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. 

లాంగ్‌మార్చ్‌ 5బి’ పరిమాణం (22 టన్నులు) మరీ ఎక్కువగా ఉండటంతో. దాని పెద్దపెద్ద విడిభాగాలు భూమిపై అలాగే పడిపోయే ముప్పుందని తొలుత కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శకలాలు భూమిని తాకినప్పుడు.. చిన్నపాటి విమానం కూలిపోయినట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ, ఆ భయాందోళనలేవీ నిజం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, జనావాసాలపై కూలే ముప్పు అత్యల్పమని కొంత మంది ఖగోళ నిపుణులు చెప్పిందే చివరకు నిజమైంది. గత ఏడాది చైనా తొలిసారి ‘లాంగ్‌మార్చ్‌ 5బి’ని ప్రయోగించినప్పుడు దాని శకలాలు ఐవరీ కోస్ట్‌పై పడి పలు గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసమైన సంగతి గమనార్హం.

Previous
Next Post »
0 Komentar

Google Tags