Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CoWIN Platform to Introduce Four-Digit Security Code to Minimise Errors

 

CoWIN Platform to Introduce Four-Digit Security Code to Minimise Errors 

ఇకపై ఆ నంబర్‌ చెప్తేనే వ్యాక్సిన్‌ ఇస్తారు

సెక్యూరిటీ పరమైన లోపాలను, వ్యాక్సిన్‌ దుర్వినియోగాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం - వైద్యారోగ్యశాఖ

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు టీకా ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. దీంతో దేశంలో అందుబాటులో ఉన్న టీకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం కొవిన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ కావాలనుకునేవారు తప్పనిసరిగా ఇందులో రిజిస్టర్‌ చేసుకోవాలి. అయితే, అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. సరైన పరిజ్ఞానం లేకపోవడంతో చాలా మంది రిజిస్టర్‌ చేసుకోలేకపోతున్నారు. ఇంకొందరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నా, స్లాట్‌ బుక్‌ చేసుకున్న సమయానికి వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లడం లేదు. దీంతో  స్లాట్‌ సమయం ముగిసిన తర్వాత ఆయా వ్యక్తులు వ్యాక్సిన్‌ వేయించుకోకపోయినా ‘వ్యాక్సినేషన్‌ కంప్లీటెడ్‌’ అంటూ సంబంధిత మొబైల్‌కు మెసేజ్‌ వస్తోంది. చాలా మందికి ఇదే సమస్య ఎదురవుతోంది. 

ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ఆరోగ్యశాఖ కొవిన్‌ పోర్టల్‌లో సరికొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై కొవిన్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకొని, వ్యాక్సిన్‌ స్లాట్‌ను బుక్‌ చేసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్‌ నెంబర్‌కు నాలుగు డిజిట్ల సెక్యూరిటీ కోడ్‌ వస్తుంది. వ్యాక్సినేషన్‌ సమయంలో అక్కడి సిబ్బందికి అది చెప్పాల్సి ఉంటుంది. అప్పుడే వ్యాక్సిన్‌ ఇస్తారు. లేకుంటే కుదరదు. అంతేకాకుండా సెక్యూరిటీ పరమైన లోపాలను, వ్యాక్సిన్‌ దుర్వినియోగాన్ని అధిగమించేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ, దేశంలో వ్యాక్సిన్‌ల కొరత తీవ్రంగా ఉండటంతో  చాలా రాష్ట్ర్రాలు చేతులెత్తేశాయి. 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సిన్‌ ఇవ్వగలమని చెప్పాయి. ఇందులో భాజపా పాలిత రాష్ట్రాలు కూడా ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర్రలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సిన్లు ఇస్తున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags