Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEFT service won't be available for 14 hours on this Day

 

NEFT service won't be available for 14 hours on this Day

NEFT సేవలు ఆ రోజున 14 గంటల పాటు పనిచేయవు

ఆన్‌లైన్‌ లావాదేవీలకు జరిపే నెఫ్ట్‌(నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) నేడు ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. 

‘‘నెఫ్ట్‌ పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22న వ్యాపార వేళలు ముగిసిన తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక అపడేషన్‌ చేపడుతున్నాం. అందువల్ల మే 23వ తేదీన 00.01 గంటల నుంచి(అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్‌ సేవలు అందుబాటులో ఉండవు. అయితే ఆర్‌టీజీఎస్‌ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి’’అని ఆర్‌బీఐ తెలిపింది. దీనిపై ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు సమాచారమిస్తాయని పేర్కొంది. 

ఏప్రిల్‌ 18న ఆర్‌టీజీఎస్‌ సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్‌ బ్యాంక్ ఇలాంటి టెక్నికల్‌ అప్‌గ్రేడ్‌ చేపట్టింది. 2019 డిసెంబరు నుంచి నెప్ట్‌ సేవలను 24×7 గంటల పాటు ఆర్‌బీఐ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags