Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Sonu Sood notifies followers about fake Covid-19 donation campaign with his name

 

Sonu Sood notifies followers about fake Covid-19 donation campaign with his name

సోనూసూద్‌ పేరుతో ఫేక్‌ ఫౌండేషన్‌ డబ్బు వసూళ్లు

ఆపదలో ఉన్నామంటూ అడిగిన వారందరికీ చేతిలో ఎముక లేదన్నట్లుగా సాయం చేస్తూ కరోనా సమయంలో ఎంతోమందికి దేవుడిగా మారారు సోనూసూద్‌. అయితే, అలాంటి సోనూసూద్‌ పేరును వాడుకొని కొంతమంది అత్యాశతో అతి తెలివి ఉపయోగించి డబ్బు వసూళ్లకు తెరతీశారు. దీనిపై సోనూ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘వార్నింగ్‌’.. ఫేక్‌ ఫౌండేషన్‌ అంటూ ఒక పోస్టును ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.

ఇంతకీ అందులో ఏముందంటే.. 

‘‘సోనూసూద్‌ ఫౌండేషన్‌కు మీరు విరాళం ఇవ్వాలనుకుంటే ఒక రూపాయి నుంచి మీకు తోచినంత విరాళం ఇవ్వండి. అందుకోసం ఒక ఫోన్‌పే నంబర్‌ అందులో అందుబాటులో ఉంచుతున్నాం. ఏదైనా అనుమానం ఉంటే హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించండి’ అంటూ నమ్మబలుకుతున్నారు. అయితే.. ఇది కాస్త సోనూసూద్‌ దృష్టికి వెళ్లింది. సదరు పోస్టును సోనూ తన ఖాతాలో పోస్టు చేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. ఇలాంటి సమయాల్లో సోనూసూద్‌ పేరుతో అక్రమంగా డబ్బు సంపాదించాలనుకోవడం నీచమైన పని అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ‘సోనూసూద్‌ గారు మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు చెప్పండి.. మేం మీకు విరాళాలు ఇస్తాం’ అంటూ స్పందిస్తున్నారు. 

కరోనా మొదలైనప్పటి నుంచి నిర్విరామంగా సోనూ పేదలకు సేవ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్‌ వేవ్‌లో ఎందరో వలస కార్మికులను ప్రత్యేక వాహనాల ద్వారా సొంత ఊళ్లకు పంపించారు. ఏకంగా విమానాలే ఎక్కించారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు ఉద్యోగాలు కల్పించారు. ఆర్థిక ఇబ్బందుల్లో వారికి డబ్బు సాయం చేశారు. వైద్య సాయం కోరిన వారికి చికిత్స చేయించారు. దాంతో ఆగకుండా సెకండ్‌ వేవ్‌లోనూ తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. తాజాగా దిల్లీలో కరోనాతో పోరాడుతూ ఆక్సిజన్‌ కోసం ఇబ్బంది పడుతున్న వారి కోసం ఏకంగా విదేశాల నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఆర్డర్‌ చేశారు. అందుకే సోనూసూద్‌ దేవుడంటూ ప్రజలు గుళ్లు కట్టి పూజలు చేస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags