Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 17-05-2021

 

TS Covid-19 Media Bulletin 17-05-2021

తెలంగాణలో 3,961  కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ సహా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా దాదాపు నాలుగు వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల వ్యవధిలో 62,591 శాంపిల్స్‌ పరీక్షించగా, 3961 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 30మంది మరణించగా, 5559మంది కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలుపుకొంటే రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,32,784కి చేరాయి. వీరిలో 4,80,458మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 2985మంది కొవిడ్‌తో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 90.17శాతం ఉండగా, మరణాల రేటు 0.56శాతంగా ఉంది.  ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సోమవారం 631 కొత్త కేసులు వచ్చాయి.

TS Media Bulletin 17-05-2021 

Previous
Next Post »
0 Komentar

Google Tags