Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలంగాణలో రేపటి నుండి 10 రోజులు లాక్‌డౌన్‌

 

తెలంగాణలో రేపటి నుండి 10 రోజులు లాక్‌డౌన్‌

లాక్‌డౌన్‌పై తెలంగాణ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (12 వ తేదీ) నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు.

రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్‌.. ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకుంది. రేపటి (మే 12 నుంచి 22వ తేదీ వరకు) నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత దాదాపు అన్ని కార్యకలాపాలూ నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. ప్రతిరోజూ 20 గంటలపాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. 

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన కేబినెట్‌ భేటీలో పలు కీలక విషయాలపై మంత్రులతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. లాక్‌డౌన్‌ విధిస్తే ఎదుర్కోవాల్సిన అంశాలు, ఇప్పటికే విధించిన రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై చర్చించారు. మరోవైపు టీకా కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లను పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags