Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Aloe Vera: Health Benefits and Side Effects

 

Aloe Vera: Health Benefits and Side Effects

కలబంద (ఆలోవీర) తో లాభాలు - కొన్ని జాగ్రత్తలు 

కలబందను ఆయుర్వేద వైద్యంలో, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు మితంగా కలబంద వాడితే లాభమే. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం నిపుణుల సలహా మేరకే వాడాలి...

కలబంద (ఆలోవీర) తో లాభాలు

>జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

>కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.

>కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది.

>కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది మరియు పంటి మీద చేరే కల్మషం తగ్గిస్తుంది.

>తాజా కలబంద గుజ్జు కీళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.

>కలబంద గుజ్జును చెక్కెరతో కలిపి సేవించడము గాని, రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.

>కలబంద గుజ్జును ఉడికించి వాపులు, గడ్డల పై కడితే తగ్గి పోతాయి.

>కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక త్వరగా మానిపోతాయి.

>రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను భుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.

>కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు, సూర్య తాపము వలన, X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములు తగ్గిపోతాయి.

>దగ్గు నివారణకై 1 స్పూన్, మిరియాలు 1/4 స్పూన్, శొంటి 1/4 స్పూన్, తేనెలో కలిపి సేవించాలి.

>కడుపు నొప్పి లోను, కడుపులో గ్యాస్ ఏర్పడినపుడు, గోధుమ పిండి, కలబంద గుజ్జు పై వాము, సైంధవ లవణము, జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని భుజించాలి.

>అర్శ మొలల యందు 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ, కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.

>కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

>కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె తో ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాలలో పూసి, కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.

 

కొన్ని జాగ్రత్తలు

>కలబందలో ఉండే లేటెక్స్ వల్ల కిడ్నీ సమస్యలు, కడుపునొప్పి, పొటాషియం లెవెల్స్ పడిపోవడం వంటి సైడ్ఎఫెక్ట్స్ కలుగుతాయి.

>అదేపనిగా రోజూ కలబంద గుజ్జు వాడితే స్కిన్ అలర్జీ, వాపు, దద్దుర్లు, కనురెప్పలు ఎర్రబడడం, చర్మం పొడిబారడం, గట్టిపడటం, ఊదా రంగు మచ్చలు ఏర్పడటం, చర్మం పగలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

>అలోవెరా రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఒక్కసారిగా తగ్గించేస్తుంది. అందుకే షుగర్ ఉన్నవారు కలబందను జాగ్రత్తగా వాడాలి.

>కలబంద జ్యూస్ అతిగా తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది.

>అధిక మొత్తంలో కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల విరేచనాలు, అతిసారం మరియు తీవ్రమైన కడుపు నొప్పి కలిగి, ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్కు దారితీస్తుంది.

>పేగు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు కలబంద కారణంగా మరింత ఇబ్బంది పడతారు.

>కడుపులో హెమరాయిడ్స్ ఉన్నవారు కలబంద జోలికే వెళ్లొద్దు.

>కలబంద రసం తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను అధికం చేసే ‘అడ్రినలిన్’ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పొటాషియం లెవెల్స్ తగ్గడంతో హార్ట్బీట్దెబ్బతింటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags