Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ కేబినెట్ నిర్ణయాలు 30-06-2021

 

ఏపీ కేబినెట్ నిర్ణయాలు 30-06-2021

 

* రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ కొనుగోలు.

* 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం.

* ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటు.

* విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను వర్సిటీగా మార్పు చేస్తూ నిర్ణయం.

* టిడ్కో ద్వారా 2,62,213 ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం.

* 2021-24 ఐటీ విధానాన్ని మంత్రివర్గం ఆమోదం.

* కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చ.

* మారిటైమ్ బోర్డుతో సంయుక్తంగా కార్యకలాపాల నిర్వహణకు మంత్రివర్గం అనుమతి.

* రీసర్వేలో పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి ఏపీ భూహక్కు చట్ట సవరణకు ఆమోదం.

* విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్‌ సెజ్‌కు భూ కేటాయింపునకు ఆమోదం.

* 81 ఎకరాల భూకేటాయింపునకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం.

* రూ.864 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి పధకం లో పుట్టపర్తి నియోజక వర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు మొదటి దశ కింద ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారాన్ని తెలిపిన కేబినెట్.

* రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాలను కొనుగోలుకు 90 కోట్ల మంజూరు కు ఆమోదం.

* విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు ఆమోదం.

* సత్యనారాయణ పురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు ఆమోదం.

Previous
Next Post »
0 Komentar

Google Tags