Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Hero Electric Cuts Prices of Popular Models by Up to 33%

 

Hero Electric Cuts Prices of Popular Models by Up to 33%

హీరో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌: 33 శాతం మేర ధరలు తగ్గించిన హీరో ఎలక్ట్రిక్

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ తన వాహన శ్రేణిలో వివిధ మోడళ్ల ధరలను సవరించింది. ఫేమ్‌-2 పథకం కింద అందించే రాయితీని కేంద్రం పెంచిన నేపథ్యంలో గరిష్ఠంగా 33 శాతం మేర ధరలను తగ్గించింది. ఫేమ్‌-2 కింద దక్కిన ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సింగిల్‌ బ్యాటరీ వేరియంట్‌పై కనిష్ఠంగా 12 శాతం, Nyx HX వంటి ట్రిపుల్‌ బ్యాటరీ వేరియంట్లపై 33 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. 

సవరించిన ధరల ప్రకారం ఫోటాన్‌ HX మోడల్‌ ఇకపై ₹71,449కు లభించనుంది. గతంలో దీని ధర ₹79,940గా ఉంది. NYX HX (ట్రిపుల్‌ బ్యాటరీ) మోడల్‌ ఇకపై ₹85,136కే లభించనుంది. గతంలో దీని ధర ₹1,13,115గా ఉంది. ₹78,640గా ఉన్న Optima ER మోడల్‌ ధర ₹58,980కి తగ్గిస్తున్నట్లు హీరో ఎలక్ట్రిక్‌ పేర్కొంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో రాబోయే ఐదేళ్లలో 5-7 మిలియన్‌ వాహనాలు రోడ్డెక్కే అవకాశం ఉందని హీరో ఎలక్ట్రిక్‌ సీఈవో సోహిందర్‌ గిల్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం 1KWhకు ₹10వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీని ₹15 వేలకు పెంచుతూ ఫేమ్‌-2 పథకంలో కేంద్రం ఇటీవల సవరణలు చేసింది. వాహనం ఖరీదులో 20 శాతం వరకు మాత్రమే అందించే సబ్సిడీని సైతం 40 శాతానికి కేంద్రం పెంచింది. దీంతో ఎలక్ట్రిక్‌ వాహన కంపెనీలు ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేస్తూ వాహన ధరలను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఏథేర్‌ ఎనర్జీ, యాంపియర్‌, టీవీఎస్‌ వంటి కంపెనీలు ధరలను తగ్గించాయి.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags