Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PAN Card: Get e-PAN in Just Few Minutes from New Income Tax Portal - Details Here

 

PAN Card: Get e-PAN in Just Few Minutes from New Income Tax Portal - Details Here

పాన్ కార్డ్: కొత్త ITR పోర్టల్ నుండి సులభంగా ఇ-పాన్ పొందండి ఇలా  

=======================

పాన్ అనేది ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) ఫైలింగ్, బ్యాంక్ ఖాతా తెరవడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ పూర్తి చేయ‌డానికి పాన్  అవ‌స‌రం. అయితే అనుకోకుండా పాన్ కార్డ్‌ను పోగొట్టుకుంటే ఎలా, దానికి బ‌దులుగా త‌క్ష‌ణ‌మే ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే స‌దుపాయం ఆదాయ ప‌న్ను విభాగం క‌ల్పిస్తుంది. ఆదాయ ప‌న్ను వెబ్‌సైట్ లో లాగిన్‌తో ఇ-పాన్ కార్డ్ పొంద‌వ‌చ్చు. అయితే పాన్ కార్డ్ సంఖ్య గుర్తు లేక‌పోతే ఆధార్ నంబ‌ర్‌తో కూడా దీన్ని పొంద‌వ‌చ్చు. కానీ దీనికోసం ఆధార్‌-పాన్ అనుసంధానం చేసి ఉండాలి. 

పాన్ నంబర్ లేకుండా ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేయడం ఎలా?

పాన్ సంఖ్య గుర్తులేక‌పోతే, ఆధార్‌-పాన్ అనుసంధానం ఇదివ‌ర‌కే చేసిన‌ట్ల‌యితే ఆధార్ నంబ‌ర్‌తో క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. ఆధార్ పాన్ లింక్ లేకపోతే కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ నుంచి ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేయలేరు. 

కొత్త‌ ఆదాయపు పన్ను పోర్టల్ నుంచి తక్షణ ఇ-పాన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, మొదట పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. 

1. అధికారిక కొత్త ఆదాయ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.

2. ఎడమ దిగువ భాగంలో ఉన్న ‘Our Services' వద్ద క్లిక్ చేయండి. 

3. అక్క‌డ‌ Instant E PAN క్లిక్ చేయండి. 

4. 'New E PAN' వద్ద క్లిక్ చేయండి. 

5. మీరు కోల్పోయిన పాన్ కార్డ్ నంబర్ మీకు గుర్తులేనందున  ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయండి. 

6. నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవండి త‌ర్వాత‌ 'Accept' బటన్ క్లిక్ చేయండి. 

7. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌పై 'OTP' అందుకుంటారు. 

8. OTP ని నమోదు చేయండి; 

9. వివరాలను జాగ్రత్తగా చెక్‌ చేయండి, మీ ఇ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి, 'Confirm'  క్లిక్ చేయండి. 

మీ ఇ-మెయిల్ ఐడీకి మీ ఇ-పాన్ వ‌స్తుంది. అక్క‌డ‌ ఇ-పాన్ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

=======================

WEBSITE

DIRECT LINK

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags