Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

మన బాలు గారు పాడిన, నటించిన, స్వర పరిచిన 5 ప్రత్యేక సినిమాలు ఇవే

 

మన బాలు గారు పాడిన, నటించిన, స్వర పరిచిన 5 ప్రత్యేక సినిమాలు ఇవే

 

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్న బాలుకి, తొలిసారిగా 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో పాడే అవకాశం వచ్చింది. 

నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అతన్ని ఎస్పీబీ అని కూడా పిలవడం కద్దు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 

మన బాలు గారు పాడిన, నటించిన, స్వర పరచిన 5 ప్రత్యేక సినిమాలు ఇవే.👇👇👇 

1. Dasavataram (Tamil: தசாவதாரம்)

* ఈ సినిమా 2008 లో విడుదల అయ్యింది.

* దీనికి దర్శకుడు కే‌ఎస్ రవికుమార్ గారు.  

* తెలుగు లో పది కమల్ హాసన్ క్యారక్టర్లకి డబ్బింగ్ మన బాలు గారే  చెప్పారు.

* ఇది మాములే కదా అంటారా, మరొక సారి చూడండి.

* ఎంత వైవిధ్యం గా చెప్పారో, దానికి ఎంత కష్టపడ్డారో.

* ఒక స్వరం కి మరొక స్వరం కి పూర్తి గా వైవిధ్యం ఉంటుంది.

* ఈ సినిమా మిగతా బాషలలో అనువాదం అయిననూ ఏ బాషలోను ఒక్క పాట కూడా పాడలేదు.



2. Mudina Maava (Kannda: ಮುದ್ದಿನ ಮಾವ)

* ఈ మూవీ 1993 లో విడుదల అయ్యింది.

* దీనికి  దర్శకుడు ఓం సాయి ప్రకాష్ గారు.

* మన మామగారు సినిమా కన్నడ లో 'ముద్దిన మావ' గా తీశారు.

* ఆ సినిమా లో దాసరి గారి కారెక్టర్ మన బాలు గారు చేశారు.

* ఈ చిత్రంలోని శశికుమార్ తెలుగు లో వినోద్ కుమార్ స్థానం లో నటించాడు.

* ఆ శశి కుమార్ పై చిత్రీకరించబడ్డ పాటలను మన బాలు పాడాడు.

* కానీ బాలు పై చిత్రీకరించబడ్డ "దీపావళి దీపావళి" మరియు "" వారణే మధు మదువే "పాటలను కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ గారు పాడారు.


3. Padamati Sandhyaragam  (Telugu - పడమటి సంధ్యారాగం)

* ఈ సినిమా 1987 లో విడుదల అయ్యింది.

* దీనికి దర్శకుడు హాస్య బ్రహ్మ జంధ్యాల గారు.

* ఈ సినిమా కి సంగీతం కూర్చింది మన బాలు గారే.

* దీనిలో ఒక ఇంగ్లిష్ పాట రాసి, పాడారు కూడా బాలు గారు.

* సినిమా కొరకు అతి తక్కువ మంది ఇండియా నుండి అమెరికా కి వెళ్లారు.

* ఈ మూవీ కి జంధ్యాల గారికి బాలు గారు ప్రతీ విషయంలో చాలా సహాయం చేశారట. 

* నటులు అందరూ అమెరికా లోని మన తెలుగు NRI వారే.

* డబ్బింగ్ మాత్రం మనకు అలవాటైన నటులు శుభలేఖ సుధాకర్, సుత్తి వీరభద్ర రావు, జంధ్యాల గారు మొ.. వారు చెప్పారు.

* హీరో గా నటించిన థామస్ కు ఇదే మొదటి సినిమా.

* ఇంకొక నటుడు రోనాల్డ్ గా నటించింది డ్రమ్ఆర్టిస్ట్ శివమణి.

* శివమణి ఎప్పుడు చెప్తుంటారు బాలు గారు నా గురువు అని.  


4. Magic Magic 3D (Malayalam: മാജിക് മാജിക് 3D)

* ఈ సినిమా 2003 లో విడుదల అయ్యింది.

* దీనికి దర్శకుడు జోస్ గారు.

* బాలు ఈ మూవీలో  ఇంద్రజాలికుడు (Magician) పాత్ర పోషించారు.

* ఈ మూవీ 70% న్యూ యార్క్ సిటి (యూ‌ఎస్) లో తీశారు.

* ఈ మూవీ హింది తో పాటు దక్షిణాది భాషలలో అనువాదం కూడా అయినది.

* అన్నింటిలోనూ తనకి తానే డబ్బింగ్ చెప్పుకొని, పాటలు కూడా పాడారు.

* మరియు ఈ సినిమాలో PSR గరుడ వేగ లోని నటి పూజ కుమార్ కూడా నటించారు.

పైన దక్షిణాది లో ఉన్న 4 భాషలలొ ప్రత్యేక సినిమాల గురించి ప్రస్తావన జరిగింది. ఇక అయిదవది ఏంటంటే బాలు మన తెలుగు వారు కాబట్టి 5వ సినిమా మన తెలుగు సినిమా ని ప్రస్తావించాము. 


5. Mithunam (Telugu: మిథునం)

* ఈ సినిమా 2012 లో విడుదల అయ్యింది.

* దీనికి దర్శకుడు తనికెళ్ల భరణి గారు.

* మొదట ఈ సినిమాకి బాలు స్థానం లో ఎల్‌బి శ్రీరామ్ ని అనుకున్నారు.

* కానీ చివరికి బాలు గారు నటించారు.

* ఈ సినిమా ప్రధాన పాటను యేసుదాసు గారు పాడారు.   

* ఈ సినిమా మన మనసులకు హత్తుకునే విధం ఉంటుంది.

* ఎందుకంటే రెండే పాత్రలతో బాలు గారు, లక్ష్మి గారు వారు సహజంగా నటించారు.

* మరియు నేటి సమాజం లో పదవీ విరమణ తరువాత ఒక జంట జీవనం ఎలా ఉంటుందో చూపించారు.   

CLICK TO WATCH MITHUNAM MOVIE 

ఇంకా అన్నీ బాషలలో ఎన్నో ప్రత్యేకతలున్న సినిమాలు ఉన్నాయని అందరికీ తెలుసు....  

గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత చరిత్ర

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయం

Previous
Next Post »
0 Komentar

Google Tags