Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు

 

TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు

తెలంగాణలోని ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్) పరిధిలోని పది, ఇంటర్ విద్యార్థులందరినీ ఉత్తీర్ణుల్ని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు నిర్ణయంతో ఓపెన్ స్కూల్‌ పదో తరగతిలో 63,581 మంది.. ఇంటర్‌లో 47,392 మంది పాసయ్యారు.

కరోనా తీవ్రత కారణంగా పరీక్షలు లేకుండా ఉత్తీర్ణులను చేసే విధివిధానాలు ఖరారు చేసేందుకు ఏడుగురు అధికారులతో ప్రభుత్వం గతంలో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులందరినీ 35 మార్కులతో ఉత్తీర్ణులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివిధ ప్రవేశ పరీక్షలు, ప్రవేశాలకు కనీస అర్హత మార్కులుగా వీటిని పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మార్కులతో సంతృప్తి చెందని వారు టాస్ పరీక్ష నిర్వహించినప్పుడు ఇంప్రూవ్‌మెంట్ నిబంధనల మేరకు రాయొచ్చని తెలిపింది.

School Education Department – COVID-19 (2nd Wave) pandemic – Permission to the Director, TOSS, to take necessary steps as per the suggestions of the Committee constituted in the matter – For Declaring the results of SSC & Intermediate candidates of Telangana Open School Society, Hyderabad, who are eligible to appear TOSS Public Examinations July, 2021 as Passed – Orders - Issued.

G.O.Ms.No. 19 Dated: 29-06-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags