Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా పాత వేతనాలే – కారణం ఇదే

 

TS: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా పాత వేతనాలే – కారణం ఇదే

పీఆర్సీ అమల్లోకి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జులై 1న పాత వేతనాలనే అందుకోనున్నారు. కొత్త వేతనాల అమలుకు వివిధ ఉత్తర్వులను ఇప్పటికే ఆర్థిక శాఖ జారీ చేసింది. అయినా ఈ మేరకు పెరిగిన వేతనాలు పొందేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ అందుబాటులోకి రాకపోవడంతో పాత వేతనాలతోనే  అన్ని శాఖలు వేతన బిల్లులను సమర్పించాయి.

ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలు పాత పే స్కేల్ ప్రకారమే బిల్లులు రూపొందిస్తున్నాయి. జిల్లాల్లోని సబ్ ట్రెజరీ కార్యాలయాలు, రాజధానిలో పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఈ మేరకే బిల్లులను అధికారులు అందిస్తున్నారు. అయితే, కొత్త వేతనాల వ్యత్యాస డబ్బులు మాత్రం జూలై 10 లోపు అందుతుందని తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌.. ఆయా శాఖల ఉన్నతాధికారులకు అంతర్గతంగా ఆదేశాలను జారీ చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags