Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (14-07-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (14-07-2021)

 

1. ప్రశ్న: సర్, ప్రమోషన్ ఇచ్చే సమయంలో స్పౌజ్ ప్రియారిటీ ఉంటుందా? ట్రాన్స్‌ఫర్ సమయంలో స్పౌజ్ కు ప్రియారిటీ ఇస్తున్నారు కదా ! ప్రమోషన్స్ లో కూడా ఇస్తారా? తెలుపగలరు.

జవాబు: Promotion కి spouse కి సంబంధము ఉండదు. ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు. పదోన్నతులకి అర్హత విషయంలో spouse వల్ల ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. పదోన్నతుల సందర్భంలో ఇచ్చే పోస్టింగ్ విషయంలో ఎలాంటి ప్రభుత్వ మార్గదర్శకాలు లేవు కాబట్టి నియామక అధికారులు వారి విచక్షణాధికారం మేరకు ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. లేదా కౌన్సిలింగ్ నందు కోరుకునే అవకాశాన్ని బట్టి ఉంటుంది.

 

2. ప్రశ్న: Sir చిన్న clarification medical leave 240 days entire service లో ఉపయోగించుకోవాలి. అంటే commutation చేస్తే 480 యేనా? దయచేసి clarity ఇవ్వండి.

జవాబు: అవును సర్. మీరు అడిగింది కరెక్ట్. Commutation 120 రోజులకు చేసుకుంటే 240 రోజుల శెలవుగా పరిగణించబడే పూర్తి జీతం వస్తుంది. ఇంక ఏ మాత్రం మెడికల్ లీవ్ అర్హత ఉండదు. మొత్తం సర్వీస్ లో 240 కముటెడ్ లీవ్ వాడుకోవచ్చు. 480 హాఫ్ పే లీవ్స్ డెబిట్ అవుతాయి.

 

3. ప్రశ్న: Declaration of Probation చేయడానికి Date of Joining consider చేస్తారా సార్, లేదా Appointment Order date ని consider చేస్తారా సార్? ఏదైనా జీవో ఉన్నదా? చెప్పగలరు.

జవాబు: Date of Joining ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ మీకన్నా మెరిట్ లిస్ట్ లో ముందున్న వారు కనుక మీ కన్నా ఆలస్యంగా చేరితే, వారు చేరిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. AP State and Subordinate Service Rules, 1996 చూడండి.

Previous
Next Post »
0 Komentar

Google Tags