Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Centre Directs Immediate Withdrawal of All Cases Under Section 66A of IT Act

 

Centre Directs Immediate Withdrawal of All Cases Under Section 66A of IT Act

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66Aపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

సాంఘిక మాధ్యమాల పోస్టుల పై అరెస్టులు శిక్షలు ఉండవు. F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి. సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Regarding implementation of Hon’ble Supreme Court Order Dated 24.03.2015 on striking down of section 66A of the Information Technology Act, 2000

కేంద్ర హోంశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ -2000 సెక్షన్‌ 66ఎ కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్‌ 66ఎ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. 

ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఏను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్‌ కింద దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు కావడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 1307 కేసులు నమోదు కాగా.. ఈ విషయంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 50కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. 




PRESS RELEASE

Previous
Next Post »
0 Komentar

Google Tags