Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు డిప్యుటేషన్లు రద్దు - బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనాలు

 

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు డిప్యుటేషన్లు రద్దు - బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనాలు

 

* గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డిప్యుటేషన్లు పూర్తిగా రద్దు చేశారు.

* బయో మెట్రిక్‌ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించనున్నారు.

* రోజూ సాయంత్రం ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమానికి ఉద్యోగులంతా విధిగా హాజరు కావాల్సి ఉంటుంది.

* ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

* వ్యవసాయ, పశుసంవర్థక, సంక్షేమశాఖల్లో, పోలీసుస్టేషన్లలో డిప్యుటేషన్లపై సేవలు అందిస్తున్న ఉద్యోగులంతా ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పని చేయాలి.

* ఉదయం కార్యాలయానికి వచ్చినపుడు, తిరిగి సాయంత్రం వెళ్లేప్పుడు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి.

* జులై 1 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చినా పలు జిల్లాల్లో బయోమెట్రిక్‌ హాజరు 50 నుంచి 60 % ఉండటంపై సీఎం కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

* సోమవారం నుంచి ఇది 90 శాతానికి పైగా ఉండాల్సిందేనని కలెక్టర్లకు సూచించారు. అంతకంటే హాజరు తక్కువగా ఉంటే ఎంపీడీవోలను బాధ్యులను చేయనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags