Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Providing Electric 2-Wheelers to Government Employees on EMI Basis – G.O Released

 

Providing Electric 2-Wheelers to Government Employees on EMI Basis – G.O Released

AP: ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీతో ఎలక్ట్రిక్ స్కూటర్లు

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి విద్యుత్‌ వాహనాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాటరీ సామర్థ్యం, వేగం ఆధారంగా వాహనాల ధర ఉంటుంది. ఉద్యోగులు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా నెలవారీ వాయిదాలు కట్టేలా వాహనాల తయారీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వేతనాల నుంచి నెలవారీ వాయిదాలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. నెలకు రూ.2,500 వరకు చెల్లించేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాహనాలను ఎన్టీపీసీ, ఎస్సెల్‌ సంస్థలు రాయితీతో ఇస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆసక్తిగల సిబ్బంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సమాచారం పంపింది. 

కాలుష్యం తగ్గించాలని..

రాష్ట్రంలో సుమారు 80 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనానికి రోజుకు సగటున అర లీటరు పెట్రోలు వాడినా, 40 లక్షల లీటర్లు అవసరం అవుతుంది. వీటివల్ల వెలువడుతున్న కాలుష్యం, కర్బన ఉద్గారాలను కొంతైనా తగ్గించడానికి విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని నెడ్‌క్యాప్‌ భావిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉండగా.. తొలివిడతలో లక్ష మందికి వీటిని అందిస్తుంది. నెలవారీ వాయిదాను సిబ్బంది జీతం నుంచే నేరుగా చెల్లించేలా వాహన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. మూడు సంవత్సరాల పాటు వాహనాల నిర్వహణ బాధ్యత కూడా తయారీ సంస్థదే. 

కిలోవాట్‌కు రూ.10 వేలు సబ్సిడీ

ఒక్కో కిలోవాట్‌ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10 వేలు చొప్పున కేంద్రం రాయితీ ఇస్తుందని నెడ్‌క్యాప్‌ ఎండీ తెలిపారు. బండి వేగాన్ని బట్టి గరిష్ఠంగా రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు సబ్సిడీ వస్తుంది. నెడ్‌క్యాప్‌ అందించే వాహనాలు గంటకు 25-55 కి.మీల వేగంతో నడవనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ రాయితీ సొమ్ము చెల్లిస్తుంది. వెహికల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఆమోదించిన నమూనాలను పరిశీలించి రాష్ట్రంలో విక్రయానికి పలు సంస్థలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘సాధారణ ఉద్యోగి రోజుకు సగటున అర లీటరు చొప్పున నెలకు 15 లీటర్ల పెట్రోలు కొనేందుకు సుమారు రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోంది. విద్యుత్‌ వాహనానికి ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్‌ చేస్తే మూడు యూనిట్లు ఖర్చవుతుంది. సుమారు 100 కి.మీ ప్రయాణించవచ్చు. ఇంట్లోనే బ్యాటరీ ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు. పెట్రోలుకు వెచ్చించే మొత్తానికి ఇంకొంత కలిపితే నెలవాయిదా సరిపోతుంది’ అని అధికారులు చెబుతున్నారు.

NREDCAP- Promotion of E-Mobility-Providing Electric 2-Wheelers to Village Secretariats, Ward Secretariats and other Government employees on EMI basis- Deduction of EMI amount from the salary of individual employee based on the undertaking of the individual employee and recommendation of the Drawing and Disbursement Officer (DDO) in Andhra Pradesh State-Orders-Issued.

G.O.MS.No. 4 Dated: 06-07-2021

DOWNLOAD G.O

 


EVNREDCAP ANDROID APP

వాయిదా పద్ధతిలో ఎలక్ట్రికల్ బైకులు కావలసినవారు ఆండ్రాయిడ్ క్రింద ఇవ్వబడ్డ APP  ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 👇

DOWNLOAD APP

Previous
Next Post »
0 Komentar

Google Tags