Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

World Deepest Swimming Pool Measuring 196feet Deep Opens in Dubai

 

World Deepest Swimming Pool Measuring 196feet Deep Opens in Dubai

డీప్‌ డైవ్‌ దుబాయ్‌: ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభం

దుబాయ్‌ ప్రభుత్వం ‘డీప్‌ డైవ్‌ దుబాయ్‌’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్‌ పూల్‌ను నిర్మించింది. అంతేగాకుండా ఇది గిన్నిస్‌ రికార్డ్‌ నెలకొల్పింది. నాడ్‌ అల్‌ షెబా ప్రాంతంలో నిర్మితమైన ఈ స్విమ్మింగ్‌పూల్‌ను దుబాయ్‌ యువరాజు హమ్‌దాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఈ పూల్‌కి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ‘‘60 మీటర్ల లోతున్న (196 అడుగులు) ప్రపంచంలోకెల్లా అత్యంత లోతైన పూల్‌ ‘డీప్‌ డైవ్‌ దుబాయ్‌’ మీ కోసం ఎదురుచూస్తోందని’’ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఈ పూల్‌ను ముఖ్యంగా డైవింగ్‌లో శిక్షణ తీసుకునే వారికోసం, నీటి లోతట్టు ప్రాంతాల్లో డైవింగ్‌ చేసే ఆసక్తి కలిగిన వాళ్ల కోసం ఏర్పాటు చేశారు. దీనిలో పాడుబడిన నగరం ఆకృతులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. డైవింగ్‌ చేస్తూ పలు ఆటలు ఆడుకునే ఏర్పాట్లు చేశారు. ఈ పూల్‌లో ఉన్న 56 కెమెరాలు డైవింగ్‌ చేస్తున్న వారిని నిరంతం పర్యవేక్షిస్తుంటాయి. ఇందులోని నీరు 6 గంటలకు ఒక సారి శుద్ధి చేస్తారు. దీన్ని నింపడానికి 1.4 కోట్ల లీటర్ల నీటిని వినియోగించారు. నీటిని శుద్ధి చేయడానికి నాసా అభివృద్ధి చేసిన అధునాత వడపోత సాంకేతికతను ఉపయోగించినట్టు పూల్‌ నిర్వాహకులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి ఆహ్వానితులను మాత్రమే డైవింగ్‌ చేసేందుకు అనుతిస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags