Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

All India Radio to Commemorate 75th Independence Day with Special Series

 

All India Radio to Commemorate 75th Independence Day with Special Series

భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆల్‌ఇండియా రేడియా ప్రత్యేక కానుక ఇదే!

భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆల్‌ఇండియా రేడియో(ఎఐఆర్‌)దేశానికి ఓ ప్రత్యేక కానుక ఇస్తున్నట్లు వెల్లడించింది. రాబోయే 75 వారాల పాటు ప్రసారమయ్యే కార్యక్రమాలు.. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన చారిత్రక సంఘటనల గురించి తెలియస్తామని పేర్కొంది.

ఈ సందర్భంగా ఎఐఆర్‌ డైరెక్టర్ ఎన్వీరెడ్డి మాట్లాడుతూ..‘‘ఆగస్టు16 నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభించనున్నాం.  స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఎందరో వీరుల త్యాగాలు, వారి జీవితాల గురించి ఈతరానికి పెద్దగా తెలియదు. వారికి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. వివిధ రాష్ట్రాలకు చెందిన పోరాటయోధుల గురించి ఆయా భాషల్లో వారి గురించి తెలియని అంశాలను ఈ ప్రసారాల్లో వివరించనున్నాం’’ అన్నారు. 

‘75’ సంఖ్యను ప్రతిబింబిస్తూ 

ఆగస్టు23 (సోమవారం).. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు కీలక పాత్ర పోషించిన మహనీయులు.. మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్, సర్దార్‌వల్లభభాయ్‌ పటేల్‌, బీఆర్‌ అంబేడ్కర్ గురించి ‘దరోహర్‌’ అనే పేరుతో ఉపన్యాసాలు ఉంటాయి. ఆగస్టు24 (మంగళవారం) ‘అపరాజిత’ పేరుతో స్వాతంత్ర్య సమరంలో కీలకపాత్ర పోషించిన 75మంది నారీమణుల గొప్పతనాన్ని వివరిస్తూ.. ‘‘గట్స్‌ అండ్‌ గ్లోరీ ఆఫ్‌ 75 ఉమెన్‌ కార్యక్రమం’’ నిర్వహిస్తారు.

ఆగస్టు25 (బుధవారం) స్వాతంత్ర్య సమరంతో అనుబంధం పంచుకున్న 75 ప్రదేశాల వివరాలు. ఆగస్టు26 (గురువారం) గిరిజనుల బాగుకోసం పోరాటం చేసిన ఉద్యమకారుల గురించి వివరిస్తూ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ సాయంత్రం 4.30 నుంచి 5గంటల సమయంలో ప్రసారం కానున్నాయి. అంతేకాదు.. 75 వారాలపాటు ప్రసారం చేసిన ఎపిసోడ్స్‌లో ప్రసారమైన అంశాల మీద క్విజ్‌ పోటీలను దేశంలోని 31 ప్రధాన కేంద్రాల్లో నిర్వహిస్తారు.

MOBILE ANDROID APP

MOBILE iOS APP

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags