Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBDT Extends Due Dates For E-Filing of Various Income Tax Forms

 

CBDT Extends Due Dates For E-Filing of Various Income Tax Forms

ITR: వివిధ ఆదాయపు పన్ను ఫారమ్‌ల ఇ-ఫైలింగ్ గడువు తేదీలను పొడిగింపు

ఈక్వలైజేషన్‌ లెవీ, చెల్లింపుల నివేదిక దాఖలు సహా వివిధ పన్ను చెల్లింపులకు పన్ను విభాగం గడువు పెంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈక్వలైజేషన్‌ లెవీ స్టేట్‌మెంట్‌ (ఫామ్‌-1) దాఖలుకు డిసెంబరు 31 వరకు గడువు పెంచింది. జూన్‌, సెప్టెంబరు త్రైమాసిక చెల్లింపులకు సంబంధించిన నివేదిక(ఫామ్‌ 15సీసీ) వరుసగా నవంబరు 30, డిసెంబరు 31లోపు సమర్పించాలని పేర్కొంది.

* ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కార పథకం వివాద్‌ సే విశ్వాస్‌ చెల్లింపుల గడువును సెప్టెంబరు 30 వరకు సీబీడీటీ పొడిగించింది.

* పింఛను నిధులు, సార్వభౌమ సంపద నిధులు దేశీయంగా పెట్టే పెట్టుబడుల వివరాలు తెలిపే ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్‌ గడువును కూడా పెంచింది. జూన్‌, సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించిన వివరాలను నవంబరు 30, డిసెంబరు 31లోపు ఇ-ఫైలింగ్‌ చేయాలని పేర్కొంది.

* జూన్‌, సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించిన ఫామ్‌ 15జీ/15హెచ్‌లను కూడా వరుసగా నవంబరు 30, డిసెంబరు 31లోపు సమర్పించాలి.

* జూన్‌ 7న కొత్తగా తీసుకొచ్చిన ఆదాయపు పన్ను పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక ఇబ్బందుల వల్ల గడువు తేదీలను పెంచుతున్నట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది.

* వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఆమ్నెస్టీ పథకాన్ని పొందడానికి చివరి తేదీని ఆర్థిక శాఖ 3 నెలలు పొడిగించింది. నెలవారీ రిటర్నులు సమర్పించడంలో ఆలస్యమైన పన్ను చెల్లింపుదార్లు చెల్లించాల్సిన తగ్గించిన రుసుమును నవంబరు 30 వరకు చెల్లించవచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. 2017 జులై నుంచి 2021 ఏప్రిల్‌ వరకు జీఎస్‌టీఆర్‌-3బీ సమర్పించని పన్ను చెల్లింపుదార్లు ఒక్కో రిటర్నుకు రూ.500 (ఎలాంటి పన్ను లేకపోతే), రూ.1,000 (పన్ను చెల్లించాల్సి ఉంటే) రుసుము చెల్లించి ఈ నెల 31లోపు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండగా, తాజాగా దీన్ని మరో 3 నెలలు పొడిగించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags