Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Five Best Photo Editing APPs for Photographers – Details Here

 

Five Best Photo Editing APPs for Photographers – Details Here

Photo Editing Apps: ఫొటోగ్రాఫర్స్ మెచ్చే ఐదు ఫొటో ఎడిటింగ్ యాప్‌లు ఇవే

చేతిలో ఫోన్ ఉంటే చాలు..ఎంచక్కా ఫొటోలు తీసేయ్యొచ్చు. కానీ ఫొటో తీసిన తర్వాత దాన్ని ఎడిట్‌ చేయాలంటే మాత్రం ఫోన్ కెమెరాలో ఉండే ఎడిటింగ్ ఫీచర్స్ సరిపోవు. క్రాప్‌, ఫిల్టర్, టెక్ట్స్ యాడింగ్ మినహా..ఇతర టూల్స్ కావాలంటే మాత్రం థర్డ్‌ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిందే. అందులో ఏవి మంచివో తెలియదు. వాటిలో కొన్నింటిలో యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ ఉంటే, మరికొన్ని యూజర్‌కి ఒక పట్టాన అర్థం కావు. అందుకే ఫొటో ఎడిటింగ్‌ యాప్‌లు కావాలనుకునే వారి కోసం ఫొటోగ్రాఫర్స్ మెచ్చే ఐదు ఫొటో ఎడిటింగ్ యాప్‌ల జాబితా..👇

1. అడోబ్ లైట్‌ రూమ్‌ (Adobe Light Room)

DOWNLOAD ADOBE LR APP

ప్రొఫెషనల్‌ తరహా ఫొటో ఎడిటింగ్ కోరుకునే వారి కోసం అడోబ్ అందిస్తున్న యాప్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి ఈ యాప్ ఉచితంగా అందుబాటులో ఉంది. మొబైల్‌లో తీసిన ఫొటోలను యాప్‌లో సులువుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో లైట్స్, షాడోస్‌, హీలింగ్ బ్రష్ టూల్స్‌తో ఫొటోలను అందంగా మార్చుకోవచ్చు. ఫొటో ఎడిటింగ్‌కి సంబంధించి ఈ యాప్‌లో ఉచిత టుట్యోరియల్స్ ఉన్నాయి. లైట్ రూంలో లెర్న్‌ సెక్షన్‌లోకి వెళితే అందులో బిగినర్, ఇంటర్మీడియెట్, అడ్వాన్స్‌డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకుని మీ ఫొటో ఎడిటింగ్ నైపుణ్యానికి మెరుగులద్దుకోవచ్చు. అడోబ్ లైట్ రూం ప్రీమియం వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని కోసం సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి.

2. స్నాప్‌సీడ్ (SnapSeed)

DOWNLOAD SNAPSEED APP

గూగుల్ అందిస్తున్న మరో ఫొటో ఎడిటింగ్ యాప్ స్నాప్‌సీడ్. తొలుత ఈ యాప్‌ను నిక్‌ సాఫ్ట్‌వేర్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. తర్వాత స్నాప్‌సీడ్‌ని గూగుల్ సొంతం చేసుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ యాప్‌లో ఎన్నో రకాల కీలక మార్పులు చేశారు. ఇందులో లుక్స్‌, టూల్స్, ఎక్స్‌పోర్ట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. లుక్స్ ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రాం ఫిల్టర్స్‌లో ఉన్నట్లుగా ఫొటో కలర్‌ సాచ్యురేషన్, టోన్ సులభంగా మార్చుకోవచ్చు. టూల్స్‌ సాయంతో ఫొటో టెక్చర్‌, లైటింగ్‌, టోన్‌లో మార్పులు చెయ్యొచ్చు. అలానే బ్లర్‌ ఫిల్టర్‌, టెక్ట్స్, ఫ్రేమ్‌ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎక్స్‌పోర్ట్‌ ఫీచర్‌తో మీరు ఎడిట్ చేసిన ఫొటోని సోషల్‌ మీడియా లేదా ఫోన్‌లోకి షేర్ చెయ్యొచ్చు. ఈ యాప్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌కి అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా ఉచితం. 

3. ప్రిస్మా (Prisma)

DOWNLOAD PRISMA APP

ఫొటోలను ఆర్ట్‌ పెయింట్‌ ఇమేజ్‌లుగా మార్చుకోవాలనుకునే వారు ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇందులోని ఫిల్టర్ అల్గారిథమ్ యాప్‌లోకి అప్‌లోడ్ చేసిన ఫొటో డేటాను స్కాన్ చేసి ఆర్ట్‌ పెయింట్‌ ఫొటోగా మారుస్తుంది. ఈ యాప్‌లో వేర్వేరు డిజిటల్‌ ఎఫెక్ట్‌లు ఫొటో కలర్‌, షేప్, ప్యాట్రన్‌ వంటి వాటిలో మార్పులు చేసి ఆర్ట్‌ పెయింట్ ఇమేజ్‌ను యూజర్‌కి అందిస్తుంది. ఈ యాప్‌ను మూడు రోజుల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులో ఉంది. 

4. వీఎస్‌సీఓ (VSCO)

DOWNLOAD VSCO APP

ఈ యాప్‌లో ఫొటోలతోపాటు వీడియోలను ఎడిట్ చెయ్యొచ్చు. అంతేకాకుండా ఇదో సోషల్‌ మీడియా యాప్‌లా కూడా పనిచేస్తుంది. ఈ యాప్‌లో ఉన్న ఎడిటింగ్‌ టూల్స్‌తో మీ ఫొటో లేదా వీడియోలలో సులువుగా, త్వరితగతిన మార్పులు చెయ్యొచ్చు. ఇందులోని ఫిల్టర్స్‌తో ఫొటోలను వింటేజ్ లుక్‌లోకి మార్చుకోవచ్చు. అలానే స్ల్పిట్ టోన్, హెచ్‌ఎస్‌ఎల్ వంటి అడ్వాన్స్‌డ్‌ ఫొటో ఎడిటింగ్ టూల్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులోని వీఎస్‌సీఓ కమ్యూనిటీలో మెంబర్‌షిప్‌ తీసుకుని ప్రతి వారం జరిగే ఫొటో ఛాలెంజ్‌ పోటీల్లో పాల్గొనవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓస్ యూజర్స్‌కి ఈ యాప్ పూర్తిగా ఉచితం. వీఎస్‌సీఓ కమ్యూనిటీలో మెంబర్‌ షిప్‌ కావాలంటే మాత్రం ఏడాదికి 19.99 డాలర్లు చెల్లించాల్సిందే.

5. పిక్స్ఆర్ట్ (PicsArt)

DOWNLOAD PICSART PHOTO EDITOR 

ఈ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ యాప్‌లు అందించే అన్ని రకాల ఎడిటింగ్ టూల్స్‌ ఉన్నాయి.సాధారణ క్రాప్‌, కర్వ్‌, ఫ్లిప్, రొటేట్, స్ట్రెచ్ వంటి వాటితోపాటు టూల్స్ సెక్షన్‌లో ఎఫ్‌ఎక్స్‌ పేరుతో అదనంగా ఎడిటింగ్ టూల్స్ ఇస్తున్నారు. ఇందులోని బ్యూటీ టూల్‌తో ఫొటోని మరింత అందంగా మార్చుకోవచ్చు. పిక్స్‌ఆర్ట్‌లో బేసిక్‌, ప్రీమియం గోల్డ్ అని రెండు వెర్షన్లు ఉన్నాయి. బేసిక్‌ యాప్ వెర్షన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి పూర్తిగా ఉచితం. ప్రీమియం గోల్డ్ వెర్షన్ కావాలనుకుంటే నెలకు 11.99 డాలర్లు, ఏడాదికి 55.99 డాలర్లు చెల్లించి సబ్‌స్కైబ్‌ చేసుకోవాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags