Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Govt Launches Amrit Mahotsav App Innovation Challenge 2021 For Indian Entrepreneurs, Start-Ups

 

Govt Launches Amrit Mahotsav App Innovation Challenge 2021 For Indian Entrepreneurs, Start-Ups

కేంద్రం అమృత్ మహోత్సవ్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 – వివరాలు ఇవే

కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ‘అమృత్‌ మహోత్సవ్ యాప్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ 2021’ పేరిట పోటీని నిర్వహిస్తోంది. గతేడాది నిర్వహించిన ‘ఆత్మనిర్భర్ భారత్‌ యాప్‌ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌’కు కొనసాగింపుగా ఈ పోటీ నిర్వహిస్తోంది. గతేడాది 8 కేటగిరీల్లో పోటీలు నిర్వహించగా, ఈ సారి ఆ సంఖ్యను 16 కేటగిరీలకు పెంచారు.

ఇందులో గెలుపొందిన విజేతలకు భారీగా నగదు బహుమతి అందిచనున్నారు. మొదటి విజేతకు రూ.25 లక్షలు, రెండో విజేతకు రూ.15 లక్షలు, మూడో విజేతకు రూ.10 లక్షలు చొప్పున ఇవ్వనున్నారు. ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు తమ వివరాలను సెప్టెంబరు 30లోగా ఇన్నోవేటివ్‌ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలి. వివరాల నమోదుకు ఈ లింక్‌ పై క్లిక్ చేయండి. 

గతేడాది చైనా యాప్‌లపై నిషేధం విధించిన తర్వాత ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా విదేశీ యాప్‌లకు ధీటుగా దేశీయంగా యాప్‌లను రూపొందించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గతేడాది వేర్వేరు కేటగిరీల్లో దేశీయంగా రూపొందిన యాప్‌లను ఎంపిక చేసి నగదు బహుమతి అందించారు. తాజాగా ఈ ఏడాది కూడా 16 కేటగిరీలకు పోటీలను నిర్వహిస్తున్నారు.

వీటిలో సంస్కృతి & వారసత్వం (Culture & Heritage), ఆరోగ్యం (Health), విద్య (Education), సామాజిక మాద్యమం (Social Media), సాంకేతికత (Emerge Tech), నైపుణ్యాలు (Skills), వార్తలు (News), క్రీడలు (Games), వినోదం (Entertainment), ఆఫీస్‌ (Office), ఫిట్‌నెస్‌ & న్యూట్రిషన్ (Fitness & Nutrition), వ్యవసాయం (Agriculture), వ్యాపారం&రిటైల్‌ (Business & Retail), ఫిన్‌టెక్‌ (Fintech), నేవిగేషన్ (Navigation), ఇతర అంశాలు (Others) ఉన్నాయి. యాప్‌ల ఎంపికలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో పోటీలో పాల్గొనేవారి నుంచి వచ్చిన దరఖాస్తులకు పరిశీలించి అర్హులైన వారిని తర్వాతి దశకు ఎంపిక చేస్తారు. రెండో దశలో ఎంపిక  కమిటీలోని సభ్యులు యాప్‌ల డెమోలను పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు. సెలక్షన్ జ్యూరీలో ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా, ప్రయివేటు రంగాలకు చెందినవారు ఉంటారు. ఈ పోటీలో పాల్గొనేందుకు భారతీయులు మాత్రమే అర్హులు. 

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags