Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (27-08-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు సమాధానాలు (27-08-2021)

 

1. ప్రశ్న:

EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా?

జవాబు:

EOL కాలాన్ని అర్హత గల సెలవుగా లెక్కించరు. కానీ వ్యక్తిగత కారణాలతో EOL ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపుకి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.

 

2. ప్రశ్న:

నేను HM గా పనిచేస్తున్నాను. అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. పరిస్థితి ఏమిటి? 

జవాబు:

FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది. కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు. ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి. SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు. 

 

3. ప్రశ్న:

నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..? 

జవాబు:

మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది. GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు. GO MS No:262, Dt:25-8-1980 

 

4. ప్రశ్న:

ఏ నెలలో ఆర్జిత సెలవును నగదుగా మార్చుకోవాలి? 

జవాబు:

మెమో.1478 ; ఆర్ధిక ; తేదీ:22.6.11 ప్రకారం 12 నెలల వ్యవధిలో 15 రోజులు,24 నెలల కాల వ్యవధి లో 30 రోజులు ఏ నెలలో నైనా ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవచ్చు. 

 

5. ప్రశ్న:

వేసవి సెలవుల్లో ముందు రోజు బడికి వెళ్ళాను. సెలవులు అనంతరం ప్రారంభం రోజు బడికి వెళ్లలేకపోతే ఏ విధమైన సెలవు పెట్టుకోవచ్చు? 

జవాబు:

Ldis. no.1933, తేదీ:30.3.84 ప్రకారం అర్ధజీతపు, కమ్యూటెడ్, సంపాదిత, జీతనష్టం సెలవులను మాత్రమే వాడుకోవాలి.

Previous
Next Post »
0 Komentar