Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు – సమాధానాలు (29-08-2021)

 

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు సమాధానాలు (29-08-2021)

 

1. ప్రశ్న:

నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను. నేను ఆ ఉద్యోగంలో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా?

జవాబు:

జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టులో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది. అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.

======================================

2. ప్రశ్న:

బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా?

జవాబు:

6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.

========================================

3. ప్రశ్న:

నేను జీత నష్టపు సెలవు పెట్టి M. ed చేయాలని అనుకుంటున్నాను. నేను ఏమి నష్టపోతాను?

జవాబు:

జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్, AAS స్కేల్స్ వాయిదా పడతాయి. 3 ఇయర్స్ పైన జీతనష్టపు సెలవుకాలం పెన్షన్ కి అర్హదాయక సర్వీస్ గా పరిగణింపబడదు.

=========================================

4. ప్రశ్న:

నేను, నా భర్త టీచర్లం. నా భర్త మరణించిన పిదప నాకు కుటుంబ పెన్షన్ ఇస్తున్నారు. దీనికి DA ఇవ్వరా?

జవాబు:

జీఓ.51, తేదీ: 30.4.15 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వారికి మాత్రమే DA ఇవ్వరు. మీకు కుటుంబ పెన్షన్ పై DA చెల్లిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags