Ola Electric Scooter to Be Launched in
India Tomorrow
రేపే `ఓలా`
ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభం - స్కూటర్ పేరు
ఇదే
పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోతున్న ఈ సమయంలో అందరి కళ్లు ఎలక్ట్రికల్ బైక్‌ల మీదనే ఉన్నాయి. అంతేగాక మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో విధించే రుసుములు కూడా ఎలక్ట్రికల్ వాహనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇవ్వడానికి సిద్దపడుతున్నాయి. అద్దెకు వాహనాలను సమకూర్చే `ఓలా` ఈ రంగంలో ప్రవేశించి కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్‌ను ఈ ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయడానికి సిద్ధపడుతుంది. వినియోగదారులను ఆకర్షించడానికి ఓలా స్కూటరును అనేక రంగులతో ఉత్పత్తి చేయడానికి కంపెనీ కృషి చేస్తుంది.
`ఓలా` ఎలక్ట్రికల్ స్కూటర్ విడుదలకు ఇంకా ఒక రోజే సమయం ఉంది. స్కూటర్‌పై వినియోగదారులకు ఆసక్తి పెంచడానికి కంపెనీ నెలల తరబడి ప్రచారం చేస్తూ వస్తుంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల కోసం గత నెలలో బుకింగ్ కూడా ప్రారంభించింది. `ఓలా` స్కూటర్ ప్రపంచంలోనే అత్యధికంగా బుక్ చేసుకున్న స్కూటర్ అని కంపెనీ తెలిపింది. `ఓలా` ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు ఇంకా తెరిచే ఉన్నాయి. బుకింగ్‌ల కోసం కంపెనీ టోకెన్ అడ్వాన్స్ కింద రూ. 499 వసూలు చేస్తోంది. బుకింగ్ ప్రారంభించిన ఆరంభంలో మొదటి 24 గంటల్లోనే అనూహ్య డిమాండ్‌తో బుకింగ్‌లు లక్ష దాటాయి. లాంచ్‌కు మందు కంపెనీ కొత్త స్కూటర్ కోసం మార్కెటింగ్‌ను పెంచుతోంది. అధికారిక ప్రారంభానికి ముందు కంపెనీ `సీఈఓ` భవిష్ అగర్వాల్ స్కూటర్ ధరను ప్రకటిస్తారని పేర్కోంటూ `ఓలా ఎలక్ట్రిక్` ట్విట్టర్‌లో తెలిపింది. స్కూటర్‌ను `ఎస్ 1` అని పిలుస్తారని అగర్వాల్ తెలిపారు.
My marketing team is upto its tricks again! 🙄🙄🙄 Join me on Sunday 15th August at 2pm on https://t.co/lzUzbWbFl7 to know more about the scooter! In the meantime, tell me what do you think the price is? #JoinTheRevolution @OlaElectric https://t.co/PWQKIN5HBr
— Bhavish Aggarwal (@bhash) August 13, 2021
ఓలా స్కూటర్ కీలెస్ వంటి కొన్ని సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో వస్తుంది. స్కూటర్‌లో రివర్స్ మోడ్ (వెనక్కి తీసుకోవడం) లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. బుక్ చేసుకున్న వినియోగదారులకు ఓలా స్కూటర్‌ని నేరుగా వారి ఇళ్లకే అందించే ఏర్పాట్లు చేస్తుంది. ఓలా స్కూటర్‌కి ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 150 కి.మీ దాకా మైలేజ్ వస్తుంది. ఈ స్కూటర్‌ను `0` నుండి 50% వరకు ఛార్జ్ంగ్‌ని కేవలం 18 నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేయవచ్చు. ఈ ఛార్జింగుతోనే 75 కి.మీ. బైక్ డ్రైవింగ్ చేయవచ్చు. పనితీరు, మైలేజీని పెంచడానికి ఓలా స్కూటర్లో విభిన్న డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
0 Komentar