Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Teachers Transfer Counseling-2020: Municipal Teachers Merging Web Counselling Proceedings and Schedule

 

Teachers Transfer Counseling-2020: Municipal Teachers Merging Web Counselling Proceedings and Schedule

మునిసిపల్ మెర్జింగ్ ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ గురించి ప్రొసీడింగ్స్ మరియు షెడ్యూల్ ఇచ్చిన పాఠశాల విద్యా శాఖ

Rc.No.13029/11/2021-EST 3 Dated:31/08/2021.

Sub: - School Education – Teachers transfer counseling-2020 – Orders of the Hon’ble High court in WA’s No.80 of 2021 and batch and WP’No. 11631 of 2021 & batch – Cancellation of proceedings dated 15-6-2020 – To conduct fresh counselling through web based – Certain Instructions – Issued.

మునిసిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 6 నుంచి 21వ తేదీ మధ్య వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్జేడీలు, డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు సిద్ధం కావాలన్నారు.

గత ఏడాది ఉపాధ్యాయుల సాధారణ బదిలీల సమయంలో మునిసిపాలిటీల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్నందున తమను మునిసిపల్ ఉపాధ్యాయులుగా పరిగణించాలని 400 మందికి పైగా జెడ్పీ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అప్పట్లో వీరి బదిలీలు నిలిచిపోయాయి. కోర్టు ఉపాధ్యాయుల కేసులను కొట్టేసి, బదిలీలు చేపట్టాలని పాఠశాల విద్య అధికారులను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరి బదిలీలకు షెడ్యూల్ విడుదల చేశారు. 

షెడ్యూల్ ఇలా..

6వ తేదీ: యాజమన్య, కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ఖాళీల ప్రదర్శన

7వ తేదీ: తాత్కాలిక సీనియారిటీ జాబితా ప్రదర్శన

8, 9 తేదీలు: ప్రకటించిన జాబితాలో అభ్యంతరాల అప్లోడ్, ఆధారాలు విద్యాశాఖ అధికారులకు అందజేత

13, 14 తేదీలు: అభ్యంతరాల పరిశీలన, ఆమోదం

15వ తేదీ: తుది సీనియారిటీ జాబితా ప్రకటన

16, 17 తేదీలు: వెబ్ ఆప్షన్ల స్వీకరణ

21వ తేదీ: వెబ్సైట్లో బదిలీ ఆర్డర్ల ప్రదర్శన, డౌన్లోడింగ్.

WEB OPTIONS

Download Submitted Web Option Report

Teacher Transfers Final SeniorityList

District Wise LeftOver Vacancy Report

MAIN WEBSITE

DOWNLOAD PROCEEDINGS

DOWNLOAD TENTATIVE SCHEDULE

Previous
Next Post »
0 Komentar

Google Tags