Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

The Five Best Ways to Use a Credit Card

 

The Five Best Ways to Use a Credit Card

క్రెడిట్ కార్డుల వినియోగానికి సంబంధించి తెలుసుకోవాల్సిన ఐదు అంశాలు ఇవే

బ్యాంకులు వినియోగదారులకు అనేక రకాల క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. వీటిలో కొన్నిటిని లైఫ్ స్టైల్ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించగా మరికొన్నిటిని రివార్డ్ పాయింట్లను సంపాదించుకోవడం కోసం, అలాగే సినిమా టికెట్ల మీద డిస్కౌంట్లను పొందడం కోసం, పెట్రోలు లేదా డీజిల్ కొనుగోళ్లపై ప్రయోజనాలను పొందడం కోసం, దుస్తుల కొనుగోళ్ల పై డిస్కౌంట్ లను అందించడం కోసం రూపొందించారు. వీటితో పాటు అనేక రకాల ప్రయోజనాలను క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. అయినప్పటికీ, వినియోగదారులు క్రెడిట్ కార్డు లక్షణాలు, రివార్డ్ పాయింట్లు, వాటికి చెల్లించాల్సిన చార్జీలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆర్ధిక నిపుణులు తెలియచేస్తున్నారు.

 

క్రెడిట్ కార్డుల వినియోగానికి సంబంధించి నిపుణులు సూచించిన ఐదు అంశాలు ఇవే. 👇

1. క్రెడిట్ కార్డు లక్షణాలను వివరంగా తెలుసుకోండి:

కొన్ని సార్లు క్రెడిట్ కార్డును రుణ సంస్థలు ఉచితంగా జారీ చేసినప్పటికీ, వార్షిక పునరుద్ధరణ రుసుమును వసూలు చేయవచ్చు. మరోవైపు, వినియోగదారుడు తరచుగా జరిపే లావాదేవీలకు భిన్నమైన క్రెడిట్ కార్డులను అందిస్తుంది. మీ వ్యక్తిగత జీవనశైలికి సరిపోనీ క్రెడిట్ కార్డును ఎంచుకోవద్దని నిపుణులు తెలియచేస్తున్నారు. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు తన క్రెడిట్ కార్డ్ రివార్డు పాయింట్ల ద్వారా పెట్రోల్ / డీజిల్ లావాదేవీలు జరపడానికి ఇష్టపడవచ్చు. అలాంటి వారు దీనికి సంబంధించిన క్రెడిట్ కార్డును తీసుకోవడం మంచిది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్డు ద్వారా చేసే ఇంధన కొనుగోళ్ల పై 0.75 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. 

2. తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని తెలుసుకోండి:

చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు అనేక సార్లు తమ కొనుగోలు శక్తి కంటే ఎక్కువ మొత్తాన్ని ఉపయోగిస్తుంటారు. ఒకవేళ క్రెడిట్ కార్డు వినియోగాన్ని సరిగా నిర్వహించకుండా, సాధారణ కొనుగోలు సామర్థ్యాన్ని మించి వినియోగించినట్లైతే అది రుణ ట్రాప్ కి దారి తీయవచ్చునని నిపుణులు తెలిపారు. సాధారణంగా క్రెడిట్ కార్డ్ కంపెనీలు చెల్లించని మొత్తంపై అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి.    

3. సకాలంలో చెల్లింపులు చేయండి:

మంచి క్రెడిట్ ప్రొఫైల్ ను నిర్మించుకోడానికి క్రెడిట్ కార్డు బిల్లులను గడువు తేదీలోగా చెల్లించడం మంచిదని ఆర్ధిక నిపుణులు తెలియచేస్తున్నారు. 

4. క్రెడిట్ కార్డు వినియోగాన్ని నియంత్రించండి:

రుణం లేదా క్రెడిట్ కార్డు దరఖాస్తు విషయంలో రుణదాతలు అనేక కారణాలను పరిగణనలోకి తీసుకుంటారు. వీటిలో క్రెడిట్ స్కోర్, రుణ చరిత్ర, క్రెడిట్ వినియోగం ముఖ్య పాత్రను పోషిస్తాయి. తక్కువ క్రెడిట్ వినియోగం అనేది ఆర్ధిక భద్రతతో పాటు వ్యక్తి విశ్వసనీయతను ప్రతిభింభిస్తుంది.

క్రెడిట్ వినియోగం అనేది క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే ఒక ప్రధాన కారకం. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు వినియోగ పరిమితిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ కేవలం కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నట్లైతే,  మీ క్రెడిట్  ప్రొఫైల్ పై ప్రభావితం చూపుతుందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ ఉపాధ్యక్షురాలు సుజాత అహ్లావత్ తెలిపారు. 

క్రెడిట్ కార్డుపై మంజూరు చేసిన పరిమితిలో కేవలం 40 శాతం వరకు మాత్రమే ఉపయోగించడం సురక్షితమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 

5. గడువు సమయంలోగా గరిష్ట మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించండి:

క్రెడిట్ కార్డు బకాయిల్లో కేవలం కనీస మొత్తాన్ని చెల్లించడాన్ని నివారించి, పూర్తి మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించండి. లేదంటే అది  తక్కువ క్రెడిట్ స్కోర్ కు దారితీస్తుంది.  చెల్లింపు చరిత్ర, క్రెడిట్ వినియోగం అనేవి రెండు అత్యంత ముఖ్యమైన కారకాలు. ఒక వ్యక్తి క్రెడిట్ స్కోరులో ఇవి 50 శాతానికి పైగా దోహదం చేస్తాయి. ఈ రెండు కారకాలను మంచి స్థితిలో ఉంచడం చాలా ముఖ్యం. 

Previous
Next Post »
0 Komentar

Google Tags