Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

6 Tips to Keep Your Child Away From Mobile Phones

 

6 Tips to Keep Your Child Away From Mobile Phones

మొబైల్ ఫోన్‌ల నుండి మీ పిల్లలను దూరంగా ఉంచడానికి 6 చిట్కాలు

చిన్నపిల్లల దగ్గర్నుంచీ ముప్పయ్యేళ్ల అమ్మాయిల దాకా టీవీ, ఫోన్‌లకు అతుక్కుపోతున్నారనేది మనందరికీ తెలిసిన సంగతే. చిన్నారులైతే చదువుకు ఆటంకం కలుగుతుందని, ఎదిగిన పిల్లలయితే వృత్తి ఉద్యోగాల్లో పైకి రాలేరని అమ్మలందరి బాధా భయమూ.. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కొన్ని నియమాలు పెట్టి కొంత కఠినంగా వ్యవహరించక తప్పదంటున్నారు మానసిక నిపుణులు. 

* పిల్లల ఫోనుల్లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ అకౌంట్లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. లేదా నెట్‌ యాక్సెస్‌ లేకుండా చేయండి. అదనపు ఫీచర్లను బ్లాక్‌ చేయండి. అనవసర యాప్స్‌ను తొలగించేయండి.

* అత్యవసర మాటలూ మెసేజీలకే ఫోన్‌ పరిమితమని కచ్చితంగా చెప్పండి. మొబైల్‌ను ఆడియో బుక్స్‌, వీడియో స్టోరీస్‌ లాంటి మెదడును వికసింపచేసే అంశాలకు వినియోగించేలా చూడండి.

* వీడియో గేమ్స్‌ లాంటివి కూడా రోజులో కొద్దిసేపేనని నిబంధన పెట్టండి. కేటాయించిన సమయానికి మించి స్క్రీన్‌ టైం ఉంటే అడిగిన దుస్తులు లేదా వస్తువులు కొనివ్వమంటూ గట్టిగా ఆంక్షలు పెట్టండి.

* మొబైల్‌కి అలవాటు పడితే కళ్లకి ఇబ్బందే కాదు మానసిక అనారోగ్యాలూ వస్తున్నాయని, చాటింగులూ షేరింగుల వల్ల కాలం చాలా వృథా అవుతుందని, గడిచిన క్షణం కూడా వెనక్కి రాదని విడమర్చి చెప్పండి. ఏదైనా ఉదాహరణలతో చెబితే బాగా అర్థమవుతుంది.

* అరచేతిలో ప్రపంచాన్ని చూపే ఫోన్‌లో విజ్ఞాన వినోదాలతో బాటు వికారాలూ వైపరీత్యాలూ అపారమని వివరంగా చెప్పండి. 

* పిల్లలకు ఈ మాత్రం జాగ్రత్తలు చెప్పకపోతే వాళ్లు గాడి తప్పిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు సైకాలజిస్టులు.

Previous
Next Post »
0 Komentar

Google Tags