Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Amazon to Host First-Ever Career Day on Sep 16 in India - Plans to Hire For 8,000 Direct Jobs

 

Amazon to Host First-Ever Career Day on Sep 16 in India - Plans to Hire For 8,000 Direct Jobs

ఇండియా లో అమెజాన్ తొలిసారిగా సెప్టెంబర్ 16న కెరీర్ డే నిర్వహణ - 8,000 ప్రత్యక్ష ఉద్యోగులను నియమించడానికి ప్రణాళికలు

 

దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా 35 నగరాల్లో 8000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగులను ఈ ఏడాది నియమించుకోడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది. కార్పొరేట్‌, టెక్నాలజీ, వినియోగదారు సేవ, కార్యకలాపాలు, మెషీన్‌ లెర్నింగ్‌, మానవ వనరుల విభాగం, ఫైనాన్స్‌, న్యాయ విభాగాల్లో ఈ ఉద్యోగావకాశాలు ఉంటాయని అమెజాన్‌ హెచ్‌ఆర్‌ లీడర్‌ (కార్పొరేట్‌, అపాక్‌, మేనా) దీప్తి వర్మ పేర్కొన్నారు.

ఈనెల 16న సంస్థ భారత్‌లో తొలిసారిగా కెరీర్‌ డే నిర్వహించడం ద్వారా ఈ నియామకాలు జరపనుంది.  2025 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాల సృష్టించడమే లక్ష్యమని, ఇప్పటికే భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించామని దీప్తి వర్మ వివరించారు.  

జెబియా 2000 నియామకాలు: 2022 చివరికి భారత్‌లోని రెండో అంచె నగరాల నుంచి 2000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోడానికి సన్నాహాలు చేస్తున్నట్ల నెదర్లాండ్స్‌ ఐటీ కన్సల్టెన్సీ సంస్థ జెబియా వెల్లడించింది. ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న వారి నుంచి సీనియర్‌ స్థాయి ఐటీ నిపుణుల వరకు అవకాశాలుంటాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags