Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

General Transfer for the year 2021-22 – Transfer guidelines for the employees working in the Department of Collegiate Education

 

General Transfer for the year 2021-22 – Transfer guidelines for the employees working in the Department of Collegiate Education

డిగ్రీ బోధన, బోధనేతర సిబ్బందికి బదిలీలు -ఈనెల 30లోపు పూర్తి చేయాలని ఆదేశాలు

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బదిలీలను వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఈనెల 30లోపు పూర్తి చేయాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. మారుమూల ప్రాంతాల కళాశాలల్లో కనీస అధ్యాపకులు ఉండేలా చూడాలని, అవసరమైన అధ్యాపకుల సంఖ్య, పని భారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

జూన్‌ 30 నాటికి రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీలకు అర్హులు. ఒకేచోట అయిదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి తప్పనిసరి స్థానభ్రంశం ఉంటుంది. 2023 జూన్‌ 30 నాటికి ఉద్యోగ విరమణ పొందే వారిని మినహాయిస్తారు. కళాశాల విద్య కమిషనర్‌ బదిలీలకు ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. 50ఏళ్లలోపు వయసున్న పురుషులను మహిళా కళాశాలల్లో నియమించరు. మహిళా కళాశాలల్లో పోస్టింగ్‌ కోసం అధ్యాపకురాళ్లు ఐచ్చికం నమోదు చేసుకుంటే... అక్కడ పనిచేస్తున్న పురుషులను బదిలీ చేసి, మహిళలకు అవకాశం కల్పిస్తారు. పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకులుగా పనిచేస్తున్న వారు, అంధులు బదిలీ కోరుకుంటేనే చేస్తారు.

 

కేటగిరీల వారీగా పాయింట్లు ఇలా.. 

🍏2016 యూజీసీ వేతనాలను పొందుతూ పుర, నగరపాలక సంస్థల పరిధిలోని కళాశాలల్లో పనిచేస్తున్న వారికి ఏడాదికి మూడు పాయింట్లు ఇస్తారు. 

🍏కేటగిరీ-2కు ఏడాదికి అయిదు పాయింట్లు ఇస్తారు. 2015 రాష్ట్ర పేస్కేళ్లు తీసుకుంటూ కేటగిరీ-1లో పనిచేస్తున్న వారికి ఏడాదికి రెండు, కేటగిరీ-2లోని హెచ్‌ఆర్‌ఏ 14.5% ఉన్నవారికి మూడు, కేటగిరీ-3 వారికి అయిదు పాయింట్లు ఇస్తారు. ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేసే వారికి ఏడాదికి అదనంగా అయిదు పాయింట్లు ఇస్తారు. 

🍏ఒంటరి మహిళకు పది, 40%-60%లోపు వైకల్యం ఉన్నవారికి అయిదు, 60%పైన వైకల్యమున్న వారికి ఎనిమిది పాయింట్లు ఉంటాయి. 

🍏దీర్ఘకాలిక వ్యాధులు, ఉద్యోగిపై ఆధారపడిన పిల్లల చికిత్సకు అయిదు, స్పౌజ్‌ కోటాకు పది పాయింట్లు ఇస్తారు. 

🍏అధ్యాపకుల పనితీరుకు ప్రత్యేక పాయింట్లు నిర్ణయించారు. అకడమిక్‌కు బాగుంటే అయిదు, సంతృప్తిగా ఉంటే మూడు, 2019లో రాష్ట్ర అవార్డు పొందిన వారికి అయిదు పాయింట్లు ఇస్తారు. 

* 2019-20లో విద్యార్థుల ఉత్తీర్ణత 40%లోపు ఉంటే ఎలాంటి పాయింట్లు ఇవ్వరు. 40%-60% ఉంటే మూడు, 61%-80% ఉంటే అయిదు, 80%పైన ఉంటే ఏడు పాయింట్లు ఇస్తారు. 

* బదిలీ అయిన అయిదు రోజుల్లోపు పనిచేసే కళాశాల నుంచి రిలీవ్‌ అయి కొత్త కళాశాలలో చేరాల్సి ఉంటుంది. 

Higher Education – Collegiate Education – General Transfer for the year 2021-22 – Transfer guidelines for the employees working in the Department of Collegiate Education Orders – Issued

G.O.Rt.No.245

Dated: 15.09.2021 

DOWNLOAD GO 245

Previous
Next Post »
0 Komentar

Google Tags