Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు (12-09-2021)

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలుసమాధానాలు (12-09-2021)

=======================

1. ప్రశ్న:

CPS ఉద్యోగులు తమ ఖాతాలోని జమలు ఎన్ని సార్లు విత్ డ్రాయల్ చేసుకోవచ్చు?

జవాబు:

మూడు సందర్భాలలో విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో, మరణించిన సందర్భంలో, పదవీ విరమణ కి ముందే పథకం నుంచి నిష్క్రమించే సందర్భంలో.

==========================

2. ప్రశ్న:

ఒక టీచర్ 2015 లో 7 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు. పోస్టింగ్ ఆర్డర్ లో రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తున్నట్లు ఇచ్చారు. అతనికి ఎప్పుడు ఇంక్రిమెంట్లు ఇస్తారు?

జవాబు:

అతనికి 2015, 2016 లలో రావాల్సిన ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసి, 2017 లో ముందు రెండు ఇంక్రిమెంట్లు కూడా కలిపి మంజూరు చేస్తారు.

=========================

3. ప్రశ్న:

సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు. ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా?

జవాబు:

వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.

=============================

4. ప్రశ్న:

నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను. నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా?

జవాబు:

అవకాశం లేదు.

=============================

5. ప్రశ్న:

నా భార్య CPS ఉద్యోగి. ఆమె మరణించారు. ఇపుడు నేను ఏమి చేయాలి?

జవాబు:

CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి. సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి. వీరు వాటిని PRA ముంబై కి పంపాలి. వారు పరిశీలించి, మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.

Previous
Next Post »

1 comment

  1. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 5 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ గా పని చే సి న తర్వాత ఏం ఈ డి చదవడానికి ఎస్సీ ఎస్టీ వారికి స్టడీ లీవు పూర్తి జీతం తో ఇస్తారా (బీ ఈ డీ) లో వా డు కోక పొతే

    ReplyDelete

Google Tags