Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలు – సమాధానాలు (16-09-2021)

 

ప్రభుత్వ ఉపాధ్యాయుల సందేహాలుసమాధానాలు (16-09-2021)

◼◼◼◼◼◼◼◼◼◼

1. ప్రశ్న:

ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు. అతనికి ఎన్ని Els జమచేయబడతాయి??

జవాబు:

వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.

•••••••••

2. ప్రశ్న:

మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు. ఎవరు మాలో సీనియర్ అవుతారు??

జవాబు:

సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.

•••••••••

3. ప్రశ్న:

FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా??

జవాబు:

FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.

•••••••••

4. ప్రశ్న:

నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??

జవాబు:

జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.

•••••••••

5. ప్రశ్న:

నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము. ఒకే రోజు జాయిన్ అయ్యాము. SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??

జవాబు:

SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే, వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.

Previous
Next Post »

1 comment

Google Tags