Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Various Banks Zero Balance Savings Accounts and Interest Rates

 

Various Banks Zero Balance Savings Accounts and Interest Rates

వివిధ బ్యాంకులు అందిస్తున్న జిరో బ్యాలెన్స్ అకౌంట్లు మరియు లభించే వ‌డ్డీ రేట్లు

చాలా వ‌ర‌కు ఆర్థిక‌ లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జ‌రుగుతున్నాయి. అందువ‌ల్ల ప్ర‌తీఒక్క‌రికి బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. కానీ బ్యాంకు పొదుపు ఖాతా తెర‌వాలంటే క‌నీస బ్యాలెన్స్ ఉండాలి. ఖాతా ఉన్న‌న్ని  రోజులు క‌నీస బ్యాలెన్స్ నిర్వ‌హించాలి. లేదంటే ఛార్జీలు చెల్లించాల్సి వ‌స్తుంది. 

దేశంలోని ప్ర‌ధాన బ్యాంకులలో ఖాతా తెర‌వాలంటే కనీసం రూ. 1000 ఉండాలి. కొన్ని బ్యాంకుల‌లో మినిమ‌మ్ బ్యాలెన్స్ నెల‌కు రూ. 5వేల నుంచి రూ.10వేల వ‌ర‌కు కూడా ఉంటుంది. కుటుంబ అవ‌స‌రాల‌కు స‌రిపోయే మొత్తాన్ని సంపాదించుకునే వారికి క‌నీస బ్యాలెన్స్ నిర్వ‌హ‌ణ భారం అవుతుంది.

ఇటువంటి వారి కోసం కొన్ని బ్యాంకులు క‌నీస బ్యాలెన్స్ అవ‌స‌రం లేకుండా పొదుపు ఖాతాను తెరిచేందుకు అనుమ‌తిస్తున్నాయి. వీటినే జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా అని పిలుస్తారు. ప్రధానంగా ఆర్థికంగా వెన‌క‌ప‌డిన వారిని ప్రోత్స‌హించ‌డానికి బ్యాంకులు  ఈ ఖాతాల‌ను అందిస్తున్నాయి. 


1. ఐడీబీఐ ఫ‌స్ట్‌ బ్యాంక్‌..

ప్ర‌థ‌మ్ సేవింగ్స్ అక్కౌంట్ పేరుతో జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను అందిస్తుంది ఐడీబీఐ ఫ‌స్ట్ బ్యాంక్‌. వ‌డ్డీ రేటు 4శాతం. రోజుకు రూ.40వేల వ‌ర‌కు విత్డ్రా చేసుకోవ‌చ్చు. ఈ ఖాతాతో రూ. 2 ల‌క్ష‌ల కాంప్లిమెంట‌రీ వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా కూడా ల‌భిస్తుంది.  అయితే ఈ బ్యాంకులో జిరో బ్యాలెన్స్ ఖాతా తెర‌వాలంటే మరే ఇతర బ్యాంకులో పొదుపు ఖాతా ఉండ‌కూడ‌దు. 

2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

ఎస్‌బీఐ అందించే జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు..బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(బిఎస్‌బిడిఏ). సాధారణ బ్యాంకు పొదుపు ఖాతాల మాదిరిగానే జీరో బ్యాలెన్స్ ఖాతాలపై ఎస్‌బీఐ వడ్డీ అందిస్తుంది. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 2.70శాతం. కేవైసి ప‌త్రాలు ఇచ్చి ఈ ఖాతాను తెరవ‌చ్చు. ఎటువంటి రుసుము లేకుండా బేసిక్ రూపే ఏటీఎం- కమ్-డెబిట్ కార్డును అందిస్తుంది.

3. య‌స్ బ్యాంక్‌..

ఈ బ్యాంక్‌ అందించే జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు..స్మార్ట్ శాల‌రీ అడ్వాంటేజ్ అక్కౌంట్‌. వ‌డ్డీ రేటు 4 శాతం. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు మాత్ర‌మే ఈ ఖాతాను తెరించేందుకు వీలుంటుంది. రూ.75వేల విత్‌డ్రా ప‌రిమితితో ‘ఎంగేజ్’ డెబిట్ కార్డ్ ఇస్తారు. ఇది వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమాతో వ‌స్తుంది. 

4. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌..

బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా(బిఎస్‌బిడిఏ) పేరుతో జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను అందిస్తుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. వ‌డ్డీ రేటు 3 శాతం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో శాల‌రీ ఎగ్రిమెంట్ ఉన్న సంస్థ ఉద్యోగులు మాత్ర‌మే ఈ ఖాతాను తెరిచేందుకు వీలుంటుంది. వేరొక బ్యాంకులో పొదుపు ఖాతా గానీ, శాల‌రీ ఖాతా గానీ ఉన్న వ్య‌క్తులు ఈ ఖాతాను తెరవ‌లేరు. 

5. కొటాక్ మ‌హీంద్రా బ్యాంక్‌..

ఈ బ్యాంక్ అందిస్తున్న జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు - 811 డిజిట్ బ్యాంక్ అక్కౌంట్‌. వ‌డ్డీ రేటు 3.50 శాతం. ఈ ఖాతాను బ్యాంకుకు రాకుండానే.. విడియో కేవైసీ ద్వారా తెర‌వ‌చ్చు. డ‌బ్బును నెఫ్ట్ లేదా ఐఎమ్‌పీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో బ‌దిలీ చేయ‌వ‌చ్చు. 

6. స్టాండ‌ర్డ్ ఛార్ట‌ర్డ్ బ్యాంక్‌..

ఈ బ్యాంక్ అందిస్తున్న జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు - ఆసాన్‌/బిఎస్‌బిడిఏ. వ‌డ్డీ రేటు 2.75 శాతం. ఖాతాలో రోజువారిగా ఉన్న బ్యాలెన్స్ ఆధారంగా వ‌డ్డీ లెక్కిస్తారు. త్రైమాసికంగా చెల్లిస్తారు.  ఆధార్ బేస్డ్ ఇకేవైసితో ఇన్‌స్టెంట్‌గా ఖాతాను తెర‌వ‌చ్చు. నెఫ్ట్‌/ఆర్‌టీజీఎస్ లావాదేవీల‌ను ఉచితంగా అందిస్తుంది. 

7. ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌..

ఈ బ్యాంక్ అందిస్తున్న జిరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా పేరు -  ఇండ‌స్ ఆన్‌లైన్ సేవింగ్స్ అక్కౌంట్‌. వ‌డ్డీ రేటు 4 శాతం. ఈ ఖాతాను తెరిచేందుకు.. మ‌నుగ‌డ‌లో ఉన్న మొబైల్ నెంబ‌రు ఉండాలి. ఇది ఆధార్‌కి అనుసంధాన‌మై ఉండాలి. అలాగే పాన్ నెంబ‌రు ఉండాలి.  ఈ ఖాతాతో రూ. 2 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా ల‌భిస్తుంది. అలాగే ప్లాటిన‌మ్ ప్ల‌స్ డెబిట్ కార్డు ల‌భిస్తుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags