Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Aakash National Talent Hunt Exam - ANTHE 2021 -Details Here

 

Aakash National Talent Hunt Exam - ANTHE 2021 -Details Here

ఆకాశ్‌ జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష -2021 - వివరాలు ఇవే 

ప్రస్తుతం 7వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆకాశ్‌ జాతీయ ప్రతిభాన్వేషణ (ANTHE 2021) పేరుతో ఓ పరీక్ష నిర్వహించనుంది.

డిసెంబర్‌ 11 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో ఈ పరీక్ష జరగనుంది.

ఈ జాతీయ స్థాయి స్కాలర్‌షిప్‌ పరీక్షలో సత్తాచాటిన విద్యార్థులకు 100 శాతం వరకు స్కాలర్‌షిప్‌తో పాటు నగదు పురస్కారాలు, ఉచితంగా నాసా ట్రిప్‌కి వెళ్లే అవకాశం కల్పించనుంది.

వీటికితోడు ANTHE 2021 పరీక్ష ద్వారా అదనంగా ఆకాశ్‌ బైజూస్‌లో అందుబాటులో ఉండే వేర్వేరు నీట్‌, జేఈఈ కోర్సులకు స్కాలర్‌షిప్‌లు పొందొచ్చు. వైద్య, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాలనే విద్యార్థులకు ఇది ఉపకరిస్తుంది. విద్యార్థుల బలాలతో పాటు వారు ఎక్కడ వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆ సమస్యను ఆకాశ్‌ బైజూస్‌లో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో అధిగమించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. 

ANTHE 2021 పరీక్ష ముఖ్యాంశాలు:

ANTHE అంటే ఆకాశ్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ఎగ్జామ్‌ (ఆకాశ్‌ జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష)

అర్హత - 7, 8, 9, 10, 11, 12 తరగతులు చదువుతున్నవారంతా అర్హులే

పరీక్ష రుసుము - ₹99 (జీఎస్టీతో కలిపి)

పరీక్ష ఏ ఫార్మాట్‌లో - ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో ఉంటుంది

రిజిస్ట్రేషన్లకు తుది గడువు: ఆన్‌లైన్‌లో రాయాలనుకొనేవారు పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. అదే ఆఫ్‌లైన్‌ పరీక్షకు అయితే ఏడు రోజుల ముందు వరకు అవకాశం ఉంటుంది.

పరీక్ష తేదీలు - ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 11 నుంచి 19 తేదీ వరకు/ ఆఫ్‌లైన్‌లో డిసెంబర్‌ 12 & డిసెంబర్‌ 19 

పరీక్ష సమయం- ఆన్‌లైన్‌ పరీక్ష ఉదయం 10గంటల నుంచి రాత్రి 7గంటల మధ్య ఎప్పుడైనా విద్యార్థి లాగిన్‌ అవ్వొచ్చు; ఆఫ్‌లైన్‌ పరీక్ష అయితే - ఉదయం శ్లాట్‌లో 10.30 గంటల నుంచి ఉదయం 11.30గంటల వరకు;  సాయంత్రం శ్లాట్‌లో సాయంత్రం 4 గంటల నుంచి 5గంటల వరకు పరీక్ష ఉంటుంది. 

ఫలితాలు ఎప్పుడు?

10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి ఈ పరీక్ష ఫలితాలు వచ్చే ఏడాది జనవరి 2న ప్రకటిస్తారు. అదే 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థుల ఫలితాలైతే 2022 జనవరి 4న ప్రకటిస్తారు. 

ANTHE 2021కి ఎందుకు రిజిస్టర్‌ చేసుకోవాలి?

డాక్టర్‌ లేదా ఇంజినీర్‌ కావాలనే కలను నెరవేర్చుకునేందుకు, 100 శాతం వరకు స్కాలర్‌షిప్‌ పొందేందుకు, నాసా ట్రిప్‌కు ఉచితంగా వెళ్లే అవకాశం పొందేందుకు, నగదు పురస్కారాలు గెలుచుకునేందుకు, ఆల్‌ ఇండియా స్థాయిలో మీ ర్యాంకు చెక్‌ చేసుకునేందుకు, స్కూల్‌లో బూస్టర్‌ కోర్సుల్లో ఉచితంగా ప్రవేశించేందుకు (మెరిట్‌నేషన్‌). 

ANTHE 2021 కోసం ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి?

1. మీ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి

2. మీ రిజిస్టర్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి

3. మీ వివరాలను ఇవ్వడంతో పాటు పరీక్ష రుసుం చెల్లించాలి

4. అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి

5. రిజిస్ట్రేషన్‌ సక్సెస్‌ అయ్యాక మీరు ANTHE 2021 అడ్మిట్‌ కార్డును పొందొచ్చు. దీంతోపాటు ఉచితంగా బూస్టర్‌ కోర్స్‌ను కూడా పొందొచ్చు. 

SYLLABUS

BROCHURE

APPLICATION FORM

WEBSITE

DOWNLOAD APP

Previous
Next Post »

1 comment

Google Tags