Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

These Three Apps Are Collecting Your Sensitive Information — Uninstall Them Now

 

These Three Apps Are Collecting Your Sensitive Information — Uninstall Them Now

గూగుల్‌ ప్లేస్టోర్ ఈ మూడు యాప్ లను తీసేసింది - మీ మొబైల్ లో ఉంటే మీరూ తీసేయండి!

 

వైరస్‌, మాల్‌వేర్‌ వంటి సమస్యలున్న యాప్స్‌ని గూగుల్‌ తరచుగా ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంటుంది. అలానే కొద్దిరోజుల క్రితం ప్లేస్టోర్ నుంచి సుమారు 150కి పైగా యాప్‌లను గూగుల్ తొలగించింది. ఈ క్రమంలోనే యూజర్స్ సదరు యాప్స్‌ని తమ మొబైల్‌ నుంచి డిలీట్ చేయాలని సూచించింది. తాజాగా మరో మూడు ప్రమాదకరమైన ఫొటో ఎడిటింగ్ యాప్స్‌ని ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ యాప్స్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌ లాగిన్ మెకానిజమ్‌ ఉపయోగించి యూజర్స్‌ని ఏమార్చి వారి డేటా, బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు గుర్తించామని సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పరస్కై వెల్లడించింది.

యూజర్స్ ఈ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే లాగిన్ అవసరం లేకుండా వారి ఫేస్‌బుక్‌, టిండర్‌, స్పోటిఫై వంటి సోషల్‌ మీడియా యాప్‌ల లాగిన్ వివరాలతో ఆటోమేటిగ్గా లాగిన్ అయ్యేవిధంగా సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్ ప్రోగ్రాం చేసినట్లు కాస్పరస్కై వెల్లడించింది. యూజర్స్ ఈ యాప్స్‌ని తమ డివైజ్‌ల నుంచి తొలగించి, తమ ఫేస్‌బుక్ ఖాతాల లాగిన్‌ వివరాలను రీసెట్ చేయాలని సూచించింది. అలానే యూజర్స్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసే యాప్స్‌ పేర్లలో అక్షర దోషాలు ఉంటే వాటికి దూరంగా ఉండటం ఉత్తమమని తెలిపింది.

గూగుల్ తొలగించిన యాప్స్‌ ఇవే..

* మ్యాజిక్‌ ఫొటో ల్యాబ్ - ఫొటో ఎడిటర్‌ (Magic Photo Lab: Photo Editor)

* బ్లెండర్‌ ఫొటో ఎడిటర్‌ - ఈజీ ఫొటో బ్యాక్‌గ్రౌండ్ ఎడిటర్‌ (Blender Photo Editor - Easy Photo Background Editor)

* పిక్స్ ఫొటో మోషన్‌ ఎడిట్ 2021 (Pix Photo Motion Edit 2021)

ALERT: Google Removes 136 Apps from Play Store - Check the List Here

Previous
Next Post »
0 Komentar

Google Tags