Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఎయిడెడ్‌ సంస్థల విలీనం గురించి నాలుగు ఆప్షన్లతో మెమో జారీ

 

ఎయిడెడ్‌ సంస్థల విలీనం గురించి నాలుగు ఆప్షన్లతో మెమో జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన అంశాలు, మార్గదర్శకాలతో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అంతర్గత మెమో జారీ చేసింది.

2,249 ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించగా. 702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని ప్రభుత్వం తెలిపింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని ఉన్నత విద్యా శాఖ వెల్లడించింది. విలీనానికి నాలుగు ఆప్షన్లను ఆయా సంస్థలు ఎంచుకునే అవకాశం ఉందని మెమోలో పేర్కొంది. 

ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లు ఇవే..

ఆప్షన్‌-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా ప్రభుత్వంలో విలీనానికి సుముఖత.

ఆప్షన్‌-2: ఆస్తులు మినహా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా కొనసాగే అవకాశం.

ఆప్షన్‌-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.

ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.

ఈ ఆప్షన్‌లను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

Cir.Memo.No.1072635/CE/A1/2020   Dated: 12.11.2021

Sub: Education-Policy for Surrender of Willing Private Aided Educational Institutions in the State to Government – Clarification and Certain Instructions-Issued-Reg.

DOWNLOAD MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags