Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

EPFO Gets Board Approval to Invest Up To 5% in InvITs, Alternative Funds

 

EPFO Gets Board Approval to Invest Up To 5% in InvITs, Alternative Funds

ఈపీఎఫ్‌వో -సీబీటీ కీలక నిర్ణయం - వార్షిక డిపాజిట్లలో 5% ప్రభుత్వ ఇన్విట్స్‌లో పెట్టుబడి

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ)కు చెందిన అత్యున్నత నిర్ణాయక మండలి ‘సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌(సీబీటీ)’ కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక డిపాజిట్లలో ఐదు శాతం నిధుల్ని ఇన్విట్స్‌(InvITs) వంటి ‘ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ల(AIFs)’లో మదుపు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈపీఎఫ్‌ఓ పెట్టుబడుల్లో డైవర్సికేషన్‌ ఏర్పడి రాబడి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో నష్టభయం సైతం ఎక్కువవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వ మద్దతు ఉన్న పబ్లిక్‌ సెక్టార్‌ ఇన్విట్స్‌, బాండ్లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. 

ఇప్పటి వరకు ఈపీఎఫ్‌ఓ ‘ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల(ఈటీఎఫ్‌)’లలో మాత్రమే పెట్టుబడి పెట్టింది. 2020-21లో ఈక్విటీల్లో రూ.31,025 కోట్లు, 2019-20లో రూ.32,377 కోట్లు, 2018-19లో రూ.27,743 కోట్లు మదుపు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏఐఎఫ్‌లలోనూ పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో అధిక రాబడినిచ్చే ప్రభుత్వ ఇన్విట్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఈపీఎఫ్‌ఓ సిద్ధమైంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags