Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

How to save ‘WhatsApp Status’ images and videos from friends

 

How to save ‘WhatsApp Status’ images and videos from friends

మీ స్నేహితుల వాట్సాప్‌ స్టేటస్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండీ ఇలా 

యూజర్లను వాట్సాప్‌ ఎప్పటికప్పుడు ఆకట్టుకునేలా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చిన ఫీచర్లలో వాట్సాప్‌ స్టేటస్‌ ఒక ఎత్తయితే... మిగతావన్నీ మరో ఎత్తు. ఎందుకంటే వాట్సాప్‌ స్టేటస్‌(WhatsApp Status) ఫీచర్‌ యూజర్లందరినీ అంతలా ఆకర్షించింది. ఫొటోలు, వీడియోలు, లింక్స్‌, సంతోషం/బాధ కలిగించే విషయాలు .. ఇలా ఏమైనా వాట్సాప్‌లో ఉన్న కాంటాక్ట్స్‌(Contacts) అందరితో స్టేటస్‌ ద్వారా పంచుకుంటాం.

చాలా మంది చాలా రకాల స్టేటస్‌లు పెడుతుంటారు. అందులో కొన్ని మనకు కూడా నచ్చుతాయి... అలాంటివి మన స్టేటస్‌లో అప్‌డేట్‌ చేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్లను షేర్‌(Share) చేయమని చెప్పి.. మన స్టేటస్‌లో పెట్టుకుంటాం. ఒక్కోసారి వాళ్లను అడిగేది ఏంటి ప్రతిసారీ అని.. అడగకుండా వదిలేస్తుంటాం. అలా అందరినీ అడగకుండా.. సింపుల్‌గా చిన్న ట్రిక్‌తో వాళ్ల స్టేటస్‌ను డౌన్‌లోడ్‌ చేసేసుకోవచ్చు. ఎలాగో చూసేద్దామా! 

గూగుల్‌ ఫైల్స్‌ యాప్‌

ఆండ్రాయిడ్‌ యూజర్స్(Android Users) అయితే.. గూగుల్‌ ఫైల్స్‌ అనే యాప్‌ను ప్లేస్టోర్‌(Play Store) ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. చాలావరకు స్మార్ట్‌ఫోన్లలో (Smart Phones)ఈ యాప్ డిఫాల్ట్‌గా ఉంటుంది. ఈ యాప్ లేనివాళ్లు ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్(Download) చేసుకోవచ్చు.  ఐఓఎస్‌ యూజర్స్‌ మాత్రం  ఫైల్‌ మేనేజర్‌(File Maager) అప్లికేషన్‌ ద్వారా వాట్సాప్ స్టేటస్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

DOWNLOAD GOOGLE FILES APP

1. గూగుల్‌ ఫైల్స్‌(Google Files) యాప్‌ డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత మెనూకి వెళ్లి సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేయాలి. 

2. అక్కడ ‘షో హిడెన్‌ ఫైల్స్‌’(Show hidden files) సెట్టింగ్‌ కనిపిస్తుంది. అది ఎనేబుల్‌ చేసుకోవాలి. 

3. ఇప్పుడు యాప్ నుంచి బ్యాక్‌ వచ్చేసి మరోసారి యాప్‌ను ఓపెన్‌ చేసి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ (Interal Storage) సెట్టింగ్స్‌కు వెళ్లాలి.

4. అక్కడ వాట్సాప్‌ ఫోల్డర్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసి, అందులో మీడియా, ఆ తర్వాత స్టేటస్‌ ఫోల్డర్‌కు వెళ్లాలి. (Internal Storage>WhatsApp>Media>Statuses) 

5. ఆ ఫోల్డర్‌లో మీ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో చూసిన స్టేటస్‌లన్నీ కనిపిస్తాయి. ఎంచక్కా మీరూ, మీ స్టేటస్‌లో అప్‌లోడ్‌ చేసుకొని ఆనందించొచ్చు. 

వాట్సాప్ స్టేటస్ ఫోల్డర్ డిఫాల్ట్‌గా హిడెన్ మోడ్‌లో ఉంటుంది. అంటే ఆ ఫోల్డర్ ఇతర ఫైల్ మేనేజర్ యాప్స్‌లో కనిపించదన్నమాట.  ఆప్షన్ ఎనేబుల్‌ చేస్తేనే ఆ ఫోల్డర్(Folder) కనిపిస్తుంది. మీరు స్టేటస్‌లో చూసే ప్రతి ఫోటో, వీడియో ఈ ఫోల్డర్‌లో సేవ్(Save) అవుతూ ఉంటాయి. ఆ ఫైల్‌ని మీ స్నేహితులకు షేర్ చేయొచ్చు. లేదా స్టేటస్‌గానూ పెట్టుకోవచ్చు. కావాలంటే వేరే ఫోల్డర్స్‌లోకి మార్చుకోవచ్చు. 

మరో విధానం 

పైన చెప్పిన గూగుల్‌ ఫైల్స్‌ ఆప్షన్‌ కొంచెం కష్టంగా అనిపిస్తే... డైరెక్ట్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోటానికి కొన్ని థర్డ్‌ పార్టీ యాప్స్‌ ఉన్నాయి. అందులో స్టేటస్‌ సేవర్‌ కూడా ఒకటి. ఇది కూడా మనకు ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు చూసిన వాట్సాప్‌ స్టేటస్‌లన్నీ అందులో కనిపిస్తుంటాయి. మనకు కావాల్సిన వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవటం, సేవ్‌ చేసుకొని వాడేయటమే తరువాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags