Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Let Children Burst Crackers: Sadhguru Offers Alternative Solution for Air Pollution Caused During Diwali

 

Let Children Burst Crackers: Sadhguru Offers Alternative Solution for Air Pollution Caused During Diwali

దీపావళి టపాసులను బ్యాన్‌ చేయకండి, పిల్లల్ని కాల్చనివ్వండి - సద్గురు జగ్గీ వాసుదేవ్‌

పండుగ నాడు టపాసులను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. మరి కచ్చితంగా టపాసుల కాల్చివేతను ఆపేయాల్సిందేనా అనే విషయంపై ఇషా ఫౌండేషన్‌ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సద్గురు తనదైన శైలిలో బదులిచ్చారు.

‘‘ కొన్నేళ్లుగా నేను టపాసులు కాల్చడం లేదు. కానీ నా చిన్నప్పుడు ఈ వెలుగుల పండుగ అంటే ఎంతో ప్రత్యేకం. సెప్టెంబర్‌ నుంచే దీపావళి రోజు టపాసులు పేల్చొచ్చని కలలు కనేవాళ్లం. పండుగ అయిపోయినా సరే!.. ఆ టపాసులను దాచుకొని మరో రెండు నెలలు రోజూ కాల్చేవాళ్లం. పర్యావరణ పరంగా చురుగ్గా ఉండే వ్యక్తులెవరూ పిల్లలను క్రాకర్స్‌ కాల్చకూడదని అనకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. టపాసులు, బాణాసంచా కాల్చే ఆనందాన్ని అనుభవించకుండా ఉండేందుకు వాయుకాలుష్యంపై ఆందోళన ఒక కారణం కాకూడదు.

వాయు కాలుష్యంపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులందరికీ నేనో ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని సూచిస్తున్నా. అదేంటంటే..ఈసారికి మీరు కాల్చడం మానేసి మీ పిల్లల్ని కాల్చనివ్వండి. అంతేకాదు.. మీ ఆఫీస్‌కు కారులో కాకుండా మూడురోజుల పాటు నడిచి వెళ్లండి.’’ అంటూ ఓ వీడియోని ట్వీట్‌ చేశారు. ఈ వీడియో కాగా నెట్టింట్లో చర్చనీయాంశమైంది.

ఓ నెటిజన్‌ ఈవిషయాన్ని విశ్లేషిస్తూ.. ‘‘ సద్గురూ! మీరు చెప్పింది నిజం. కాలుష్యానికి కారణమైన టాప్‌ 10లో కూడా దీపావళిని కారణంగా పేర్కొలేదు. బహుశా కొత్తగా వచ్చిన పర్యావరణ కార్యకర్తలు ఈ విషయాన్ని మర్చిపోయి ఉంటారు’’ అంటూ కామెంట్ చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags