Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Interesting Facts About New Year Celebrations Across World

 

Interesting Facts About New Year Celebrations Across World

కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోని దేశాలివే.. అగ్రరాజ్యాల్లో మన తర్వాతే! 

====================

కొత్త సంవత్సరం ఏ దేశంలో మొదట వస్తుంది? న్యూ ఇయర్ వేడుకలు చివరగా జరుపుకొనే దేశాలేవి? అసలు జనవరి 1న వేడుకలే జరుపుకోని దేశాలేవి? కొత్త సంవత్సరం వేడుకల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

కోటి ఆశలతో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. గత సంవత్సరం మిగిల్చిన వివిధ అనుభవాలతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యారు. 

ఏదేమైనా.. ఎవరికి వారు మాత్రం తమ కుటుంబసభ్యులతో, మిత్రులతో ఘనంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కొన్ని ఆసక్తికర వివరాలు.. 

జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలనే నిర్వహించుకోని దేశాలు కొన్ని ఉన్నాయి. వీటిలో చైనా ప్రధానమైంది. చైనాతో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోరు. వారి క్యాలెండర్ ప్రకారమే అక్కడ కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటారు. చైనా ప్రజలు ఫిబ్రవరి నెలలో వారి కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకొంటారు.

రష్యాలో కొత్త సంవత్సరం వేడుకలను రెండుసార్లు జరుపుకొంటారు. ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1, జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న వేడుకలకు జరుపుకొంటారు.

ప్రపంచంలో అందరికంటే ముందు పసిఫిక్ సముద్రంలోని సమోవా ద్వీపంలో కొత్త సంవత్సరం వస్తుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే ఆ ప్రాంతం న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు అందరికంటే ముందుగానే మొదలవుతాయి. అక్కడ మనకంటే ఐదున్నర గంటల ముందే కొత్త సంవత్సరం మొదలవుతుంది. సిడ్నీ హార్బర్‌లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తారు.

జపాన్‌తో పాటు దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మనకంటే మూడున్నర గంటల ముందే కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి.

మన పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్.. భారత్ కంటే అరగంట ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి. శ్రీలంక మనతో పాటే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొంటుంది.

భారత్ తర్వాత ఐదున్నర గంటలకు యూకేలో కొత్త సంవత్సరం మొదలవుతుంది.

మనకు జనవరి 1 ఉదయం 10.30 గంటల సమయం అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమవుతాయి. అమెరికాలోని బేకర్, హోవార్డ్ దీవులను కొత్త సంవత్సరం చివరగా వచ్చే భూభాగాలుగా పేర్కొంటారు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags