Mid-Day Meal Scheme to Include Millets
మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు - వారంలో
ఒక రోజు చిరుధాన్యాల ఆధారిత మెనూ – రాష్ట్రాలకు కేంద్రం సూచన
★ ప్రధాన మంత్రి పోషణ పథకం కింద మధ్యాహ్న భోజన
పథకంలో పిల్లలకు వారంలో ఒక రోజు చిరుధాన్యాలను అందించే అవకాశాలపై దృష్టి పెట్టాలని
రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది.
★ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు
విద్యాశాఖ సహాయమంత్రి అన్న పూర్ణదేవీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
★ పిల్లలకు మధ్యాహ్న భోజనంలో వారంలో ఒక రోజు
చిరుధాన్యాల ఆధారిత మెనూను ప్రవేశపెట్టాలి.
★ చిరుధాన్యాల ఆధారిత వంటకాలకు ప్రాచుర్యం కల్పించే
దిశగా కుక్ కమ్ హెల్పర్స్ కీ వంటల పోటీలు నిర్వహించాలి.
★ చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలను
వివరించే వీడియోలను రూపొందించి వాటిని పాఠశాలల్లో ప్రదర్శించాలి.
★ వాటి వినియోగంపై పాఠశాల మేనెజ్మెంట్
కమిటీల్లో, తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మీటింగుల్లో
చర్చించాలి ' అని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు.
0 Komentar