Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు

 

ప్రభుత్వ ఉద్యోగుల సందేహాలు – సమాధానాలు

◼◼◼◼◼◼◼◼◼◼

1.  ప్రశ్న:

స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతి కి ఏ ఏ అర్హతలు కావాలి??

జవాబు:

జీఓ.15&16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో తెలుగు ఒక సబ్జెక్టు గా మరియు తెలుగు methodology గా బి.ఈ. డి,పండిట్ ట్రైనింగ్ అర్హతలు కలిగి ఉండాలి.అంతే కానీ పి జీ లో తెలుగు ఉన్నంత మాత్రాన పదోన్నతి ఇవ్వరు.జీఓ.28&29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హతతో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హులే.

◼◼◼◼◼◼◼◼◼◼ 

2.  ప్రశ్న:

సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి??

జవాబు:

సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.

◼◼◼◼◼◼◼◼◼◼ 

3.  ప్రశ్న:

ఇంటర్మీడియట్ లో సెకండ్ language గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా??

జవాబు:

అవసరం లేదు.

◼◼◼◼◼◼◼◼◼◼ 

4.  ప్రశ్న:

మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను cca పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా??

జవాబు:

అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా సిసిఏ పొందవచ్చు.

◼◼◼◼◼◼◼◼◼◼ 

5.  ప్రశ్న:

నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??

జవాబు:

స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.

◼◼◼◼◼◼◼◼◼◼ 

Previous
Next Post »
0 Komentar

Google Tags