Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Implementation of 11th PRC - Comprehensive Leave benefits – Child Adoption Leave/ Child Care Leave/ Special Causal Leave

 

Implementation of 11th PRC - Comprehensive Leave benefits – Child Adoption Leave/ Child Care Leave/ Special Causal Leave

పిల్లల సంరక్షణ సెలవులు 180 రోజులకు పెంపు

పిల్లల దత్తత సమయంలోనూ సెలవులు

పీఆర్సీ నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు

* ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగినులకు పిల్లల సంరక్షణ సెలవును 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పదకొండో వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఉద్యోగుల సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం రాత్రి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ విడుదల చేశారు. వివరాలివి..

* పిల్లలను దత్తత తీసుకునే ఉద్యోగినులకు దత్తత సెలవు 180 రోజుల వరకూ మంజూరుచేస్తారు. ఇద్దరిలోపు పిల్లలు ఉన్నవారికే ఇది వర్తిస్తుంది. ఒక ఏడాది లోపు వయసు ఉన్నవారిని దత్తత తీసుకున్నప్పుడు ఈ సెలవు ఇస్తారు. పురుష ఉద్యోగులకూ ఇలాంటి సందర్భాల్లో పితృత్వ సెలవు 15 రోజులు ఇస్తారు. పెళ్లి చేసుకోని పురుషులు, భార్య మరణించిన వారికి, విడాకులు తీసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. పిల్లలను దత్తత తీసుకున్న ఆరు నెలల లోపు ఈ సెలవు వినియోగించుకోవాల్సి ఉంటుంది. సెలవు కాలానికి జీతం ఇస్తారు.

* దత్తత తీసుకునే పిల్లల వయసు నెలరోజుల లోపు ఉంటే.. ఆ సెలవు ఏడాది పాటు కూడా తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఒకవేళ 6-7 నెలల మధ్య వారయితే ఆరు నెలల పాటు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది.

* పిల్లల సంరక్షణకు తీసుకునే సెలవు తమ ఉద్యోగ కాలం మొత్తం మీద 180 రోజుల పాటు మహిళా ఉద్యోగులు తీసుకోవచ్చు.

* ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే నర్సింగు సిబ్బందికి, ఎముకలు, అవయవాల పరంగా ఇబ్బందులున్న ఉద్యోగులు, ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు ఏడాదికి 7 రోజుల పాటు వర్తింపజేయనున్నారు.

* కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్‌, క్షయ, కుష్టు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి అసాధారణ సెలవు మంజూరు చేయడంతో పాటు ఆ సమయంలో ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచుతూ  ఉత్తర్వులిచ్చారు. ఎన్‌జీవోల్లో మూలవేతనం రూ.35,570కు పరిమితం చేస్తూ ఎక్స్‌గ్రేషియా కనీసం రూ.11,560, గరిష్ఠంగా రూ.17,780 చెల్లిస్తారు. చివరి గ్రేడు ఉద్యోగికి కనీసం రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లిస్తారు.

Public Services - Implementation of 11th PRC - Comprehensive Leave benefits – Child Adoption Leave/ Child Care Leave/ Special Causal Leave to orthopedically challenged/ Ex-gratia on EOL for certain deceases - Orders - Issued.

G.O.Ms.No.33, Date:08.03.2022

Read the following:

1. Report of the Committee of Secretaries on 11th Pay Revision

Commission.

2. Minutes of the meeting of Ministers Committee and representatives of the Employee Associations, dt.05.02.2022.

3. O.M.No.13018/4/2004-Estt.(L), Govt of India, dt.31.03.2006.

4. G.O.Ms.No.132, Finance (HR.IV FR&LR) Dept., dt.06.07.2016.

5. G.O.Ms.No.155, Finance (FR.I) Department, dt.04.05.2010.

DOWNLOAD G.O 33

Previous
Next Post »
0 Komentar

Google Tags