Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tennis: All Four Grand Slams to Introduce Uniform 10-Point Tiebreaker in Final Set

 

Tennis: All Four Grand Slams to Introduce Uniform 10-Point Tiebreaker in Final Set

టెన్నిస్‌: ఇక పై అన్నీ గ్రాండ్‌స్లామ్స్‌లో ఒకే రూల్‌ - రానున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచే అమలు

టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టారు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌ల్లో ఇకపై ఆఖరి సెట్‌లో స్కోరు 6-6తో సమంగా ఉన్నప్పుడు 10 పాయింట్‌ టై బ్రేక్‌ ఆడేలా కొత్త రూల్‌ తీసుకొచ్చినట్లు బుధవారం గ్రాండ్‌స్లామ్‌ బోర్డు ఉమ్మడి అధికారిక ప్రకటన చేసింది. ఈ నిబంధన రానున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచే అమలు చేయనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

''ఆస్ట్రేలియన్ ఓపెన్, రోలాండ్-గారోస్(ఫ్రెంచ్‌ ఓపెన్‌), వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లాంటి మేజర్‌ గ్రాండ్ స్లామ్‌ టోర్నీలలో 10-పాయింట్ టై-బ్రేక్ ఆడాలనే ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆఖరి సెట్‌లో స్కోరు ఆరుకు చేరుకున్నప్పుడు ఈ 10 పాయింట్‌ టై బ్రేక్‌  ఆడాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సుధీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. వాటివల్ల ఆటగాళ్లు మానసికంగా అలిసిపోతున్నారు.బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ఆట నియమాలలో మరింత స్థిరత్వాన్ని సృష్టించనుంది. తద్వారా ఆటగాళ్ల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

ఇక డబ్ల్యూటీఏ, ఏటీపీ, ఐటీఎఫ్‌ లాంటి టోర్నీల్లోనూ త్వరలోనే దీనిని అమలు చేయనున్నాం. ఇందుకోసం సదరు కమ్యూనిటీ అధికారులతో విస్తృతమైన సంప్రదింపులు జరుపుతున్నాం. ముందుగా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 10 పాయింట్‌ టై బ్రేక్‌ను ట్రయల్‌ నిర్వహించనున్నాం. ఆ తర్వాత మెల్లిగా అన్నింటికి వర్తించనున్నాం'' అని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇక 10 పాయింట్‌ టై బ్రేక్‌ అనేది అన్ని గ్రాండ్‌స్లామ్‌ల్లో.. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వాలిఫయింగ్‌ నుంచి ఫైనల్‌కు వరకు ఆఖరి సెట్‌లో ఇది వర్తించనుంది. సీనియర్‌తో పాటు జూనియర్‌ సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, వీల్‌చైర్‌ డబుల్స్‌లో కూడా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఫైనల్ సెట్ 70-68 గేములతో ఆడిన మ్యాచ్ ఇదే 👇

Previous
Next Post »
0 Komentar

Google Tags