Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TN Budget Allots Rs 1000 Per Month to Govt School Girls to Pursue Higher Education

 

TN Budget Allots Rs 1000 Per Month to Govt School Girls to Pursue Higher Education

తమిళనాడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే బాలికలకి నెలకి రూ. 1,000

తమిళనాడులోని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత చదువులకి వెళ్ళే బాలికలకి అండర్ గ్రాడ్యుయేట్ పూర్తయ్యే వరకు ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున నెలవారీ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం సమర్పించిన బడ్జెట్‌లో ప్రకటించింది.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని ఆడపిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ వెల్లడించారు.. దీనికి విద్యా భరోసా పథకం అని నామకరణం చేశారు. కాగా ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు లక్షల మంది విద్యార్ధినిలకు లబ్ది చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసే వరకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయబడుతుందని తెలిపారు. ఈ కొత్త పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.698 కోట్లు కేటాయించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags